పిల్లల కోసం సేవింగ్‌ ఖాతా స్కీమ్‌

ప్రారంభించిన యూనియన్‌ బ్యాంక్‌
హైదరాబాద్‌ : ప్రభుత్వ రంగంలోని యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (యుబిఐ) నిజా మాబాద్‌లో ‘యూనియన్‌ ము స్కాన్‌ కస్టమర్స్‌ మీట్‌’ను ఏర్పాటు చేసి నట్లు తెలిపింది. ఈ సందర్బంగా 18 ఏళ్ల లోపు పిల్లల కోసం కొత్తగా సేవింగ్‌ ఎకౌంట్‌ స్కీమ్‌ను ప్రారంభించినట్లు వెల్లడించింది. ఈ సం దర్బంగా చిన్నారులకు క్విజ్‌ పోటీలను నిర్వహించి విజేతలందరికీ బహు మతులను అందించారు. ఈ సందర్బంగా యుబిఐ రీజినల్‌ హెడ్‌ శంకర్‌ హెమ్‌బ్రమ్‌ మాట్లాడుతూ.. చిన్నప్పుడే పిల్లల్లో పొదుపు అలవాట్లను పెం చాలని సూచించారు. ఇందుకు యూనియన్‌ ముస్కాన్‌ స్కీమ్‌ను ఉపయోగించుకోవాలని అన్నారు.

Spread the love