నేడు తెలంగాణలో స్కూళ్ల బంద్..

నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణలో నేడు స్కూళ్లు మూతబడనున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించడం, ప్రయివేట్ స్కూళ్లలో ఫీజుల నియంత్రణకు చట్టం తీసుకురావాలనే డిమాండ్‌తో ఎబీవిపి రాష్ట్రవ్యాప్తంగా స్కూళ్ల బంద్‌కు పిలుపునిచ్చింది. పాఠశాలల యాజమాన్యాలు సహకరించాలని కోరింది. ఇప్పటికే పలు స్కూళ్ల యాజమాన్యాలు సెలవు ఉంటుందని తల్లిదండ్రులకు మెసేజులు పంపాయి. కొన్ని ప్రాంతాల్లో పాఠశాలల మూసివేతపై ఎలాంటి సమాచారం ఇవ్వలేదు.

Spread the love