జూన్ 18 వరకు స్కూల్స్ బంద్..

నవతెలంగాణ – బీహార్: బీహార్ రాష్ట్రంలో విపరీతమైన వేడిగాలుల కారణంగా జూన్ 12 నుండి జూన్ 18 వరకు 12వ తరగతి వరకు స్కూల్స్ బంద్ ఉంటాయని పాట్నా డీఎం తెలిపారు. ఈ మేరకు సర్క్యులర్ విడుదల చేశారు. జిల్లాలో ప్రబలంగా ఉన్న హీట్ వేవ్, అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో పిల్లల ఆరోగ్యం కోసం స్కూల్ జూన్ 18 వరకు ఉండదని పాట్నా జిల్లా మేజిస్ట్రేట్ డాక్టర్ చంద్రశేఖర్ సింగ్ తన సర్క్యులర్ లో పేర్కొన్నారు. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, 1973లోని సెక్షన్ 144 ప్రకారం, పాట్నా జిల్లాలోని అన్ని ప్రయివేట్, ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ స్కూల్ మరియు అంగన్‌వాడీ సెంటర్‌తో సహా 12వ తరగతి వరకు 18 జూన్ 2023 వరకు విద్యా కార్యకలాపాలను నిలిపివేసినట్లు తెలిపారు. ఈ ఆర్డర్ జూన్ 12, సోమవారం నుండి అమలులోకి వచ్చిందని, 18 జూన్ 2023 ఆదివారం వరకు అమలులో ఉంటుందని తెలిపారు.

Spread the love