మెచి నదిపై కుప్పకూలిన మరో బ్రిడ్జి

నవతెలంగాణ – బిహార్
బిహార్‌లో తాజాగా మరో వారధి కుప్పకూలింది. కొన్ని వారాల క్రితం ఖగారియా జిల్లాలో గంగానదిపై నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి కూలిపోవడం కలకలం రేపిన సంగతి తెలిసిందే. తాజాగా.. రాజధాని పట్నాకు 400 కిలోమీటర్ల దూరంలోని కిషన్‌గంజ్‌ జిల్లాలో మెచి నదిపై కిషన్‌గంజ్‌, కతిహార్‌ ప్రాంతాలకు మధ్య నిర్మాణంలో ఉన్న వారధి శనివారం కుప్పకూలింది. కేంద్ర ప్రభుత్వ భారతమాల ప్రాజెక్టులో భాగంగా ఈ వారధిని కేంద్ర రహదారుల సంస్థ(ఎన్‌హెచ్‌ఏఐ) నిర్మిస్తోందని, తాజా ఘటనతో రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదని బిహార్‌ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్‌ తెలిపారు. ప్రమాదంలో అదృష్టవశాత్తూ ఎవరూ గాయపడలేదు.

Spread the love