వేసవి సెలవుల్లో విజ్ఞాన శిభిరం

Science camp during summer holidays– సృజనాత్మకతను వెలికితీసేలా..
– విజ్ఞానం ,వినోదం, వివేకం తో పాటు సరదాగా సాగిపోయే తెలంగాణ బాలోత్సవం  సమ్మర్ క్యాంప్
నవతెలంగాణ – హైదరాబాద్:
సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో 200 మంది విద్యార్థులతో విజ్ఞానదాయకంగా ఆదివారం ఉదయం 10 గంటలకు ప్రారంభమైంది . ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర బాల సాహితీ వేత్త చొక్కాపు వెంకటరమణ మాట్లాడుతూ బాలబందువు తెలంగాణ బాలోత్సవం అని అన్నారు హైదరాబాద్ లో సమ్మర్ క్యాంపు అంటే రూ.10 వేయిల నుండి రూ.20 వరుకు చెల్లించాల్సిందే  కానీ….మన ” తెలంగాణ బాలోత్సవం” ఉచిత సమ్మర్ క్యాంపు మే 5 నుండి 22 వరుకు సుందరయ్య విజ్ఞాన కేంద్రం బాగ్ లింగంపల్లి హైదరాబాద్ అందమైన, విశాలమైన హాలులో ఏకకాలంలో, అటు ఆటలు, ఇటు విజ్ఞానాన్ని అందించి, ఉత్సాహాన్ని ఉల్లాసానందించే..ఈ చక్కటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఇది పోటీ ప్రపంచం అని చదువొక్కటే పరిష్కారం కాదు. ఏదైనా కళలలోనూ ..క్రీడలలోనూ.. ప్రావీణ్యత సాధించాలి. ప్రావీణ్యత అంటే…? Extra qualification అదనపు అర్హతగా గుర్తిస్తున్నారని వేసవి సెలవుల్లో .. కాలాన్ని వృధాగా పోనీయకుండా కొత్త కళలను, సరికొత్త పనుల్లో ప్రావీణ్యాన్ని సంపాదించేందుకు పిల్లలు ఉత్సాహం చూపుతున్నారని ప్రతి పిల్లవాడిలోనూ సృజనాత్మకత దాగి ఉంటుంది. దాన్ని గుర్తించి వెలికి తీయడమే తెలంగాణ బాలోత్సవం నిరంతరం పిల్లల్లో పనిచేస్తుందని అన్నారు ఇందులో భాగమె ఉచిత సమ్మర్ క్యాంపుల ముఖ్య ఉద్దేశం. చిన్నారుల్లో జ్ఞాపకశక్తిని ఫోకస్ చేసి ప్రతిభ పాటవాలను మెరుగుపరిచే విజ్ఞాన క్యాంపు సమ్మర్ క్యాంపు అని అన్నారు
విజ్ఞానదర్శిని టి.రమేష్ మాట్లాడుతూ పిల్లలకు విజ్ఞాన శాస్త్ర విషయాలు సామాజిక పర్యావరణ విషయాలు పిల్లలకు ప్రయోగం నైపుణ్యాలు ప్రకృతి పాఠాలు మానవ సంబంధాలు పెంపొందించడం ఇతరుల నుండి ఎలా నేర్చుకోవాలి స్నేహితులను ఎలా సంపాదించుకోవాలి సెల్ ఫోనుకు ఎంత దూరం ఉండాలి అనేక విషయాలు ఈ సమ్మర్ క్యాంపులో నేర్పిస్తామని అన్నారు తెలంగాణ బాలోత్సవం అద్యక్షుడు భూపతి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ..” చెరువులు పెద్ద చేప లేకపోతేనే.. అన్నింటికన్నా చురుకైన చేపల ఉండాలని” ఒకరిని అనుకరించడం కాకుండా నీ శక్తిని నువ్వు తెలుసుకోవాలని పిల్లలకు బోధించారు. ఆంగ్ల భాష మోజులో పడి తెలుగు మరిచిపోతున్న ఈతరానికి తెలుగు మాధుర్యాన్ని పంచే బాధ్యత అమ్మధనాన్ని తెలుగుధనాన్ని తెలంగాణ బాలోత్సవం నేర్పిస్తుందని అన్నారు.
మే 22 న పిల్లలు నేర్చుకున్నా విషయాలు తల్లిదండ్రుల సమక్షంలో ప్రతిబోత్సవం పేరుతో ప్రదర్శన ఉంటుందని ప్రతి పిల్లవాడు సమ్మర్ క్యాంపు ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు
ఈ కార్యక్రమంలో తెలంగాణ బాలోత్సవం కార్యదర్శి ఎన్ సోమయ్య ఉపాద్యక్షురాలు మమత కే.సుజావతి కోశాధికారి జి బుచ్చిరెడ్డి చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు చొక్కాపు వెంకటరమణ గారి మెజిషియన్ షొ అద్భుతంగా అలరించినది పిల్లలు ఆట పాటలతో సరదా గా సందడిగా సాగింది 17 రోజులు సాగే సమ్మర్ క్యాంపు విధివిధానాలను వివరించారు.

Spread the love