నవతెలంగాణ -పెద్దవూర
నల్గొండ జిల్లా మిర్యాలగూడ మున్సిపాలిటీలో స్థానిక కృష్ణా కాలనీ లో గల శ్రీ చైతన్య పాఠశాలలో బుధవారం జాతీయ సైన్స్ ఎక్స్పో కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగాఎంఎల్ ఏ బత్తుల లక్ష్మా రెడ్డి, ఎంఈఓ బాలాజీ నాయక్, 20వ వార్డ్ కౌన్సిలర్ శేఖర్ రెడ్డి, ముఖ్య అతిధిగా విచ్చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎంఎల్ ఏ విద్యార్థులు తయారు చేసిన ఎక్సిబిట్ లను సందర్శించి విద్యార్థులను ప్రశంసించారు. విద్యార్థులలో దాగి ఉన్న కళా నైపుణ్యాలను వెలికి తీయడానికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమన్నారు. రాబోయే తరంలో సైన్స్ యొక్క ప్రాధాన్యతను గురించి ఎంఈఓ బాలాజీ నాయక్ విద్యార్థులకు తెలియజేసారు. ఈ కార్యక్రమం లో చైర్మన్ శ్రీధర్ గారు శ్రీ విద్య, డిజీఎం సుధాకర్, కో-ఆర్డినేటర్ సుజన్ రాథోడ్, సుజిత, ప్రిన్సిపాల్ శ్రీనివాసాచారి, వైస్ ఏ న్సిపాల్ ఉపేందర్, డీన్ సత్యనారాయణ, సి-బ్యాచ్ ఇంచార్జి వీరయ్య,ఉపాధ్యాయ బృందం పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.అదేవిధంగా స్థానిక హెూసింగ్ బోర్డు కాలనీ లో గల శ్రీ చైతన్య పాఠశాలలో ఒన్ – టౌన్ సి.ఐ ప్రసాద్ ముఖ్య అతిధి గా పాల్గొని సైన్స్ ఎక్స్పో ను ప్రారంభించారు. ఈ కార్యక్రమం లో గ్రీన్సిపాల్ కుసుమ, డీన్ నాగరాజు, ఇంచార్జి ఝాన్సీ, స్వరూప, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. స్థానిక కేశవనగర్ కాలనీ లో గల శ్రీ చైతన్య పాఠశాలలో నల్గొండ జిల్లా ఆర్ఐ సుజిత ముఖ్య అతిధి గా పాల్గొని సైన్స్ ఎక్స్పో ను ప్రారంభించారు.ఈ కార్యక్రమం లో ప్రీన్సిపాల్ ఆర్. శ్రీనివాసాచారి, ఐపీల్ ఇంచార్జి ఏ శ్రీనివాస్, డీన్ సోమయ్య, కృష్ణ, సురేష్, నరసింహులు, విష్ణు, బాలాజీ, మహేష్, సుకన్య, ధనలక్ష్మి, రజిని శ్రీనివాస్,నవాజ్,నజీర్ లు పాల్గొన్నారు.