నవతెలంగాణ-చౌటుప్పల్‌రూరల్: చౌటుప్పల్ మండలం చిన్నకొండూరు గ్రామంలో శుక్రవారం రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రధాన శాస్త్రవేత్త ప్రభావతి మాట్లాడుతూ.. రైతులకు పలు సూచనలు చేశారు.ఎకరానికి 2 బస్తాల యూరియా మాత్రమే వాడాలని, వానాకాలంలో సర్టిఫైడ్ విత్తనాలనే వినియోగించాలని సూచించారు. సాగు ఖర్చులు తగ్గించుకోవాలని, పచ్చిరొట్ట ఎరువుగా జీలుగ వేసి కలియదున్నాలని కోరారు. సర్టిఫైడ్ పురుగు మందులను మాత్రమే కొనుగోలు చేయాలని, నారుమడిలో 2 కేజీల గుళికలు వేయాలని సూచించారు.
వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య మాట్లాడుతూ.. రైతులు సేంద్రీయ వ్యవసాయం వైపు మళ్లాలని, రసాయనిక ఎరువులు, పురుగు మందులను తక్కువ మోతాదులో వాడాలని కోరారు.పీఏసీఎస్ చైర్మన్ చింతల దామోదర్ రెడ్డి మాట్లాడుతూ పంట మార్పిడి పద్ధతిని పాటించాలని,రైతులు ఆయిల్ పామ్ సాగు చేపట్టాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో చిన్నకొండూరు సర్పంచ్ తీగుళ్ల చంద్రయ్య పెద్దకొండూరు సర్పంచ్ గుండెబోయిన శిరీష, ఇస్తారి యాదవ్ పాక్స్ వైస్ చైర్మన్ చెన్నగోని అంజయ్య గౌడ్, సింగిల్ విండో డైరెక్టర్ కృష్ణ, మండల వ్యవసాయ అధికారి ముత్యాల నాగరాజు పాక్స్ సీఈఓ రమేష్ వ్యవసాయ విస్తరణ అధికారులు, శాస్త్రవేత్తలు, పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు



