జిల్లాలో ముగిసిన నామినేషన్ల పరిశీలన ప్రక్రియ

-136 మంది అభ్యర్థులు 2,001 సెట్ల నామినేషన్లు
– 5 నియోజకవర్గాల్లో 16 నామినేషన్లు తిరస్కరణ
– జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ ప్రియాంక అల
నవతెలంగాణ-పాల్వంచ
శాసనసభ ఎన్నికల భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని నామినేషన్ల పరిశీలన ప్రక్రియ ముగిసినట్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్‌ ఎన్నికల అధికారి ప్రియాంక అలా తెలిపారు. జిల్లాలోని ఐదు నియోజకవర్గాలకు ఈ నెల మూడో తేదీ నుంచి 10వ తేదీ వరకు జరిగిన నామినేషన్లు ప్రక్రియ ముగింపు తదుపరి సోమవారం నిర్వహించిన పరిశ్రమంలో 16 నామినేషన్లు తిరస్కరణకు గురైనట్లు చెప్పారు. జిల్లాలోని ఐదు నియోజకవర్గాలకు మొత్తం 136 మంది అభ్యర్థులు 211 సెట్లు నామినేషన్లు దాఖలు చేసినట్లు తెలిపారు. ఈనెల 15వ తేదీ నామినేషన్ల ఉపసంహరణ ఉంటుందని, తదుపరి తుది జాబితాను ప్రకటించనున్నట్లు ఆమె తెలిపారు. పినపాక నియోజకవర్గంలో 25 నామినేషన్లు దాఖలు కాగా 3 నామినేషన్లు తిరస్కరించారు. 22 మంది అర్హత పొందారు. ఇల్లందు నియోజకవర్గంలో 34 నామినేషన్లకుగాను 4 నామినేషన్లు తిరస్కరించగా 30 మంది అర్హత పొందారు. కొత్తగూడెం నియోజకవర్గంలో 36 నామినేషన్లు దాఖలు కాగా 2 తిరస్కరణకు గురి అయ్యాయి. 34 నామినేషన్లు అర్హత సాధించాయి. అశ్వరావుపేట నియోజకవర్గంలో 23 నామినేషన్లు డాక్టర్‌ కాగా 2 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. 21 నామినేషన్లు అర్హత పొందారు. భద్రాచలం నియోజకవర్గంలో 18 నామినేషన్లకుగాను 5 నామినేషన్లు తిరస్కరణ గురికాగా 13 నామినేషన్లు అర్హత పొందాయి. ఈనెల 15వ తేదీన నామినేషన్లు ఉపసంహరణ ప్రక్రియ ఉంటుందని తర్వాత జాబితాను ప్రకటించినట్లు తెలిపారు.

Spread the love