నవతెలంగాణ-హైదరాబాద్: బీహార్ మాజీ సీఎంలకు ఆ రాష్ట్ర ప్రభుత్వం భద్రతను కుదించింది. మాజీ ముఖ్యమంత్రులు రబ్రీ దేవి, లాలూ ప్రసాద్ యాదవ్‌లకు జెడ్-ప్లస్ భద్రత తొలగింపుతో పాటు పాట్నాలోని తమ 10 సర్క్యులర్ రోడ్ నివాసం బయట మోహరించిన భద్రతా సిబ్బందిని కూడా పంపించివేశారు. ప్రస్తుతం బీహార్ మంత్రి నంద్ కిషోర్ రామ్‌కు కేటాయించిన 10 సర్క్యులర్ రోడ్‌ను ఖాళీ చేయాలని బీహార్ ప్రభుత్వం రబ్రీ దేవిని సూచించింది. హార్డింగ్ రోడ్‌లో ప్రత్యామ్నాయ ప్రభుత్వ నివాసానికి వెళ్లాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నోటీసులో పేర్కొంది.
రాష్ట్రీయ జనతా దళ్ (RJD) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్. రబ్రీ దేవి తన పదవీకాలంలో ఈ నివాసం(10 సర్క్యులర్ రోడ్ నివాసం) నుండే బీహార్ ముఖ్యమంత్రిగా విధులు నిర్వర్తించారు. అప్పటి నుండి ఈ ప్రాంగణం రాష్ట్రీయ జనతా దళ్‌కు ఒక కీలకమైన రాజకీయ కేంద్రంగా ఉంటూ వస్తోంది. ఈ అధికారిక నివాసాన్ని ఖాళీ చేయడానికి బీహార్ ప్రభుత్వం లాలూ కుటుంబానికి 15 రోజుల గడువు ఇచ్చింది, దీని ప్రకారం వారు జూన్ 15 నాటికి ఖాలీ చేయాల్సింది.



