శతజయంతి ఉత్సవాల్లో ఎమ్మెల్యే మెగారెడ్డి
నవతెలంగాణ – వనపర్తి
నిస్వార్థ ప్రజా డాక్టర్ బాలకృష్ణయ్య అని వనపర్తి శాసనసభ్యులు తూడి మేగా రెడ్డి అన్నారు. డాక్టర్ బాలకృష్ణయ్య 100 సంవత్సరాల జయంతి ఉత్సవాల సందర్భంగా కమాన్ చౌరస్తాలో డాక్టర్ బాలకృష్ణయ్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. డాక్టర్ బాలకృష్ణయ్య ఒక ప్రజా డాక్టర్గా వనపర్తి పట్టణ ప్రజలకు బడుగు బలహీన వర్గాలకు వెనుకబడిన కులాలకు వైద్యం అందించారని తెలిపారు. ఆయన ప్రజా డాక్టర్ గా మంచి పేరు తెచ్చుకోవడం, ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ వనపర్తి నియోజకవర్గ సమన్వయకర్త లక్కాకుల సతీష్, పట్టణ అధ్యక్షుడు చీర్ల చందర్, మాజీ కౌన్సిలర్లు, పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
నిస్వార్థ ప్రజా డాక్టర్ బాలకృష్ణయ్య
- Advertisement -
- Advertisement -



