సీపీఐ సీనియర్ నాయకులు పైళ్ల యాదిరెడ్డి సీపీఐ(ఎం)లో చేరిక..

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
మోత్కూర్ మండలం ముసిపట్ల గ్రామానికి చెందిన సీపీఐ సీనియర్ నాయకులు పైళ్ల యాదిరెడ్డి సీపీఐ పార్టీని వదిలి సీపీఐ(ఎం) లో చేరారు. సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్ సీపీఐ(ఎం) జిల్లా కార్యాలయంలో కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ .. సీపీఐ(ఎం) పార్టీగా నిరంతరం ప్రజా ఉద్యమాలు నిర్వహిస్తున్న తరుణంలో అనేకమంది సీపీఐ(ఎం) పార్టీకి ఆకర్షితులై పార్టీలో చేరడానికి ముందుకు వస్తున్నారని, ప్రాణుల రోజులలో ప్రజా సమస్యలను పోరుబాట ద్వారా అధ్యయనం  చేసి భవిష్యత్ కార్యక్రమాలు ఉదృతం చేసేందుకు సీపీఐ(ఎం) ముందుంటుందని వారన్నారు. జులై 1 నుండి 30 వరకు సీపీఐ(ఎం) పల్లె పల్లెకు పోరుబాట పేరుతో గ్రామాలలో పాదయాత్రలు, సమస్యల అధ్యయన యాత్రలు చేస్తూ ప్రజా సమస్యలపై పోరాటాలను రూపొందిస్తుందని వారన్నారు. సీపీఐ(ఎం) చేసే ప్రజా పోరాటాలకు ఆకర్షితులై సీపీఐ(ఎం) లో చేరుతున్నారని వారు తెలిపారు. అదేవిధంగా పైళ్ళ యాదిరెడ్డి మాట్లాడుతూ.. సీపీఐ(ఎం) పార్టీ నిరంతరం ప్రజల కోసం చేసే పోరాటాలను చూసి, పార్టీ విధానాన్ని చూసి పార్టీలో చేరుతున్నానని వారు అన్నారు. గతంలో జరిగిన పార్లమెంట్ సార్వత్రిక ఎన్నికల్లో సీపీఐ(ఎం) పార్టీ విధానం బాగా నచ్చిందని, బూర్జువా పార్టీలకు తొత్తులుగా మారకుండా ఒక విధానాన్ని ఎంచుకొని, సీపీఐ(ఎం) ముందుకు పోతుందని, అందువల్ల సీపీఐ(ఎం) పార్టీలో చేరుతున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ, బట్టుపల్లి అనురాధ, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మాటూరు బాలరాజు, కల్లూరు మల్లేశం, దాసరి పాండు, జిల్లా కమిటీ సభ్యులు బొల్లు యాదగిరి, గుండు వెంకటనర్సు , దయ్యాల నరసింహ, సిర్పంగి స్వామి మాయ కృష్ణ, జెల్లెల పెంటయ్య, బొడ్డుపల్లి వెంకటేష్, ఎండి పాషా, గడ్డం వెంకటేష్ నాయకులు పాల్గొన్నారు.
Spread the love