సీపీఐ(ఎం) సీనియర్ నాయకురాలు కూసు సాయమ్మ మృతి

నవతెలంగాణ – నూతనకల్
మండల పరిధిలోని చిల్పకుంట్ల గ్రామానికి చెందిన సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు కూసు సాయమ్మ అనారోగ్యంతో సోమవారం సాయంత్రం మరణించింది. మంగళవారం సీపీఐ(ఎం) మండల కార్యదర్శి కందాల శంకర్ రెడ్డి మృతురాలి మృతదేహంపై ఎర్రజెండాను కప్పేసి శ్రద్ధాంజలి ఘటించి ఘన నివాళులర్పించారు. మృతురాలికి సంతాపం తెలిపి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. సంతాపం తెలిపిన వారిలో సీపీఐ(ఎం) మండల నాయకులు అలిపురం సంజీవరెడ్డి, బొజ్జ శ్రీను, అంజేపెల్లి లక్ష్మయ్య, తొట్ల లింగయ్య, ముండ్ల సంజీవ, గజ్జల సాయి రెడ్డి, కట్ట సత్యనారాయణ రెడ్డి, కట్ట నర్సిరెడ్డి, ఎల్లవుల నరేష్, ఉప్పుల వెంకన్న, జటంగి లింగయ్య, రాంబాబు తదితరులు ఉన్నారు.

Spread the love