సీఎం కేసీఆర్‌కు శర్వానంద్‌ ఆహ్వానం

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
ఇటీవల వివాహం చేసుకున్న ప్రముఖ నటుడు శర్వానంద్‌, గురువారం ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావును మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. శుక్రవారం సాయంత్రం హైద్రాబాద్‌లో జరిగే తన వివాహ రిసెప్షన్‌ వేడుకకు రావాల్సిందిగా కేసీఆర్‌ను ఆహ్వానించారు. ఈ సందర్భంగా శర్వానంద్‌కు సీఎం వివాహ శుభాకాంక్షలు తెలిపారు.

Spread the love