లైన్ మేన్ కృషితో మూడు ట్రాన్స్ ఫార్మర్ల బదలాయింపు.. 

నవతెలంగాణ – డిచ్ పల్లి

ఇందల్ వాయి మండల కేంద్రంలోని తిర్మన్ పల్లి గ్రామంలో విద్యుత్ అదిక బరువుతో పలుమార్లు ఇబ్బందులు పడుతున్నారనే విషయమై తిర్మన్ పల్లి లైన్ మేన్ కపిల్ ప్రత్యేక కృషి తో గ్రామంలో ముడు ట్రాన్స్ఫర్ లను తోలగించి వాటి స్థానంలో 25 కెవి కలిగిన ట్రాన్స్ఫార్మర్ లను బుధవారం అమర్చి నట్లు తెలిపారు.గతంలో గ్రామంలో విద్యుత్ సమస్య వల్లా పలుమార్లు అదిక లోడ్ తో వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారనే విషయమై డిచ్ పల్లి ఏడి శ్రీనివాస్ రావు,డిఈ ఆపరేషన్ ఉత్తమ్ జాడే, ఏఈ పండరి నాథ్ ల దృష్టికి తిర్మన్ పల్లి టిజీ ఎన్పిడిసిఎల్ లైన్ మేన్ కపిల్ తిసుకుని వచ్చారు. గ్రామంలో మొత్తం 15 కె.వి ట్రాన్స్ఫార్మర్ లో 14 ఉండగా మూడు ట్రాన్స్ఫార్మర్ల పై  అధిక లోడు ఉండడంతో గ్రామస్తులు ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఉన్నతాధికారులకు వివరించారు. వెంటనే 25 కే.విల మూడు ట్రాన్స్ఫార్మర్లను లైన్మెన్ తీసుకుని వచ్చి 15 కె.వి కలిగి ఉన్న ట్రాన్స్ఫార్మర్లను తొలగించి నూతనంగా తీసుకుని వచ్చిన వాటిని బిగించారు. గ్రామంలో లోవోల్టేజ్ అధిక లోడు సమస్య తీరిందని లైన్ మేన్ కపిల్ ప్రత్యేక కృషితోనే ఇది సాధ్యమైందని పలువురు పేర్కొన్నారు.
Spread the love