Wednesday, July 1, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంట్రంప్‌నకు షాక్

ట్రంప్‌నకు షాక్

- Advertisement -

ఒకే రోజు మూడు ఎదురు దెబ్బలు.. వ్యతిరేకంగా సుప్రీంకోర్టు తీర్పులు
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు వ్యతిరేకంగా ఆ దేశ సర్వోన్నత న్యాయస్థానం ఒకే రోజు మూడు తీర్పులు వెలువరించింది. ఆయనకు విస్తృత అధికారాలు కట్టబెడుతూ మరో తీర్పు కూడా ఇచ్చింది. అయితే అదే సమయంలో ఈ అధ్యక్షుడు తాను కోరుకున్నది ఎల్లప్పుడూ పొందలేకపోవచ్చునని వ్యాఖ్యానించింది. అమెరికా కాంగ్రెస్ ఏర్పాటు చేసిన రెగ్యులేటరీ ఏజెన్సీలలోని కమిషనర్లను మార్చే అధికారం దేశాధ్యక్షుడికి ఉంటుందని సుప్రీంకోర్టు సోమవారం ఏకగ్రీవంగా తీర్పు చెప్పింది. అత్యంత కీలకమైన నేషనల్ లేబర్ రిలేషన్స్ బోర్డు, మెరిట్ సిస్టమ్స్ ప్రొటెక్షన్ బోర్డు, కన్స్యూమర్ ప్రొడక్ట్ సేఫ్టీ కమిషన్, ఫెడరల్ ట్రేడ్ కమిషన్ అధ్యక్షులను, సభ్యులను ఎలాంటి కారణం చూపకుండా పదవుల నుంచి తొలగించే అధికారం అధ్యక్షుడికి ఉంటుందని స్పష్టం చేసింది. స్వతంత్ర రెగ్యులేటరీ ఏజెన్సీలపై దేశాధ్యక్షుడికి విస్తృత అధికారాలు కల్పించిన సుప్రీంకోర్టు…శక్తివంతమైన ఫెడరల్ రిజర్వ్ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ సభ్యురాలిని తొలగించేందుకు ట్రంప్ చేసిన ప్రయత్నాలను అడ్డుకుంది. ఫెడరల్ రిజర్వ్ గవర్నర్ లీసా కుక్ తనఖా మోసానికి పాల్పడ్డారని ట్రంప్ ఆరోపించారు. అయితే కుక్‌పై ట్రంప్ ఆగ్రహానికి వేరే కారణం ఉంది. వడ్డీరేట్లను తగ్గించకూడదని కుక్ సహా ఫెడ్ తీసుకున్న నిర్ణయాన్ని ట్రంప్ వ్యతిరేకించారు. అందుకే కుక్‌ను తొలగించేందుకు ప్రయత్నించారు. ఫెడరల్ రిజర్వ్‌పై దేశాధ్యక్షులు తమ ఇష్టాన్ని రుద్దడం అనర్థదాయకమని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.

కాగా సోమవారం నాడే మరో తీర్పు కూడా ట్రంప్‌కు వ్యతిరేకంగా వచ్చింది. కాంగ్రెస్‌కు ఎప్పుడు, ఎక్కడ, ఏ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలో నిర్ణయించే అధికారం రాష్ట్రాలకు ఉంటుందని స్పష్టం చేసింది. మెయిల్ఇన్ బ్యాలెటింగ్ ద్వారా ఎన్నికలలో మోసం జరిగే అవకాశం ఉన్నదంటూ ట్రంప్ చేసిన ఆరోపణను తోసిపుచ్చింది. ఈ తీర్పుపై ట్రంప్ వెంటనే స్పందించారు. మెయిల్ఇన్ ఓటింగును గణనీయంగా కుదించేందుకు తాను ప్రతిపాదించిన ఎన్నికల సంస్కరణల ప్యాకేజీని ఆమోదించాలని కాంగ్రెస్‌ను కోరారు. 1990లలో ఓ డిపార్ట్‌మెంటల్ స్టోర్‌లోని డ్రెస్సింగ్ గదిలో ట్రంప్ తనపై లైంగిక దాడి చేశారంటూ మాజీ పత్రికా రచయిత్రి కరోల్ ఆరోపించిన విషయం తెలిసిందే. కరోల్ పరువు ప్రతిష్టలకు ట్రంప్ భంగం కలిగించారని 2023లో నిర్ధారించిన జ్యూరీ ఆయనకు ఐదు మిలియన్ డాలర్ల జరిమానా విధించింది. దీనిని సమీక్షించాలంటూ ట్రంప్ దాఖలుచేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తాజాగా తోసి పుచ్చింది. దీనిపై ట్రంప్ తన సామాజిక మాధ్యమ వేదిక ట్రూత్ సోషల్‌లో స్పందిస్తూ ‘నాపై మోపిన ఈ కేసుకు వ్యతిరేకంగా పోరాటాన్ని కొనసాగిస్తా. పరువు నష్టం జరిగిందన్నది హాస్యాస్పదమైన ఆరోపణ’ అని వ్యాఖ్యా నించారు. మరో కేసులో కరోల్ గెలుచుకున్న 83.3 మిలి యన్ డాలర్ల నష్టపరిహారంపై అప్పీలుచేయాలని ట్రంప్ యోచిస్తున్నప్పటికీ ఐదు మిలియన్ డాలర్లకు సంబంధిన చిన తీర్పును అడ్డుకోవడానికి ట్రంప్‌నకు ఇక దారులు మూసుకుపోయినట్లుగానే భావించాల్సి ఉంటుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -