Sunday, July 19, 2026
E-PAPER
Homeసోపతిపొట్టి కథలు - పసందైన కథలు

పొట్టి కథలు – పసందైన కథలు

- Advertisement -

తక్కువ నిడివితో, పరిమిత పదాలతో కథలు రాయడం అంత సులభమేమీ కాదు. చెప్పాల్సిన విషయంలో తీవ్రత తగ్గకుండా, సూటిగా చెబుతూనే పాఠకుడి మనసుపై బలమైన ముద్రవేయాలి. అప్పట్లో మల్లాది వెంకటకృష్ణమూర్తి ఈ తరహా చిన్న కథలకు ప్రసిద్ది. నేటి తరం రచయితల్లో ఆ కిటుకు తెలిసిన రచయిత ఆర్‌.సి కృష్ణస్వామి రాజు. ప్రభుత్వ ఉద్యోగం చేసి రిటైరయిన బాల భాస్కర్‌ మూడు రోజులకు ఒకసారి కూడా స్నానం చేయడు. అలాంటిది, గత వారం రోజులుగా
చక్కగా స్నానం చేసుకుని, కొత్త బట్టలు కట్టుకుని, సెంటు కొట్టుకొని మేడమీద గదికి వెళ్లి తలుపులు వేసుకుంటూ ఉంటాడు. ఆ గదిలోపల గుట్టును కనిపెట్టి, పాఠకుడి పెదవులపై చిరునవ్వును పూయిస్తుంది అతని భార్య జయప్రియ. వర్షం జోరుతో పట్టణంలోని వివిధ ప్రాంతాలు వరద నీటితో నిండిపోయాయి. ఘంటసాల జంక్షన్‌ వద్ద, 50 ఏండ్ల మహిళ వర్షంలో నిలబడి ఉంటుంది. అంత వర్షంలో ఆమె అక్కడ ఎందుకు నిలబడి ఉందో తెలుసుకోవాలంటే ‘మ్యాన్‌ హోల్‌’ కథ చదవాల్సిందే.హొడబ్బు, పలుకుబడితో నేరం తీవ్రతను తగ్గించవచ్చని, పెద్ద తప్పు చేసినప్పటికీ చిన్న శిక్షతో బయటపడవచ్చునని ‘చిన్న వార్త’ అనే కథలో చెబుతూ సమాజం తీరును ఎండగడుతారు రచయిత.

పిల్లల్లో మంచి ఆలోచనలు నాటితే, వారు భావిభారత పౌరులై సమాజానికి మంచి చేస్తారని ‘గ్రూప్‌ ఫోటో’ కథ ద్వారా తెలుసుకుంటాం. రైతు పడే కష్టాన్ని ‘రైతే రాజు’ కథతో, మాతభూమి విశిష్టతను ‘నేలతల్లి’ కథతో,వృద్ధుల బాధలను ‘ఉప్పు-బియ్యం’ కథతో పాఠకుడికి వివరిస్తారు రచయిత. చైనా చదువు, ప్రెజర్‌ కుక్కర్‌, మెడ నొప్పి, వంశవక్షం మొదలైన కథలన్నీ పాఠకుడిని అలరిస్తాయి. ఈ పుస్తకంలో కొన్ని కథలు హాస్యాన్ని పంచితే, మరికొన్ని కథలు మనసుని మెలిపెడుతాయి. కొన్ని కథలు ఆశ్చర్యాన్ని కలిగిస్తే, మరికొన్ని కథలు ఆందోళనను కలిగిస్తాయి. కొన్ని ఆలోచింపచేస్తాయి. మరికొన్ని ఆచరించేలా ఉంటాయి. అన్ని కథలూ వేటికవి ప్రత్యేకమైనవే. కష్ణస్వామిరాజు కథలన్నీ రాయలసీమ మాండలికంలో, సొగసైన చిత్తూరు యాసలో సాగుతాయి. కథల్లో సందర్భానుసారం వారు వాడే సామెతలు, జాతీయాలు కథకు ప్రత్యేక ఆకర్షణను తీసుకుని వస్తాయి.

– పేట యుగంధర్‌, 9492571731

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -