Sunday, July 19, 2026
E-PAPER
Homeజాతీయంఒక సంతకం..జీవితాంతం అప్పు భారం!

ఒక సంతకం..జీవితాంతం అప్పు భారం!

- Advertisement -

గ్యారంటీ, సహరుణగ్రహీతగా సైన్ చేసే ముందు జాగ్రత్త
ఆర్థిక బాధ్యతలపై పూర్తి అవగాహన అవసరం
భావోద్వేగంతో నిర్ణయాలు తీసుకోవద్దు : ఆర్థిక నిపుణులు
న్యూఢిల్లీ :
ఒకరికి సహాయం చేయాలనే ఉద్దేశంతో రుణపత్రాలపై చేసిన ఒక్క సంతకం.. భవిష్యత్‌లో మన ఆర్థిక జీవితాన్నే సంక్షోభంలోకి నెట్టేసే ప్రమాదం ఉంది. భార్యాభర్తలు కలిసి తీసుకున్న రుణం, కుటుంబ సభ్యులకు ఇచ్చిన గ్యారంటీ, స్నేహితుల కోసం సహ రుణగ్రహీతగా నిలవడం వంటి నిర్ణయాలు.. సంబంధాలు ముగిసిపోయినా, పరిస్థితులు మారి పోయినా మనపై చట్టపరమైన, ఆర్థికపరమైన బాధ్యతలు పడేలా చేస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

భర్త తప్పిదం.. భార్యకు శిక్ష
ఒక విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ తన అనుభవాన్ని పంచుకున్నారు. ఆమె చాలా ఏండ్లుగా తన క్రెడిట్ కార్డు బిల్లులు, వ్యక్తిగత రుణాల ఈఎంఐలను ఒక్క రోజు కూడా ఆలస్యం చేయకుండా చెల్లించారు. దీంతో తన క్రెడిట్ స్కోర్ కూడా అద్భుతంగా ఉంది. అయితే భర్తతో విడిపోయిన తర్వాత కొత్త జీవితాన్ని ప్రారం భించేందుకు వ్యక్తిగత రుణం కోసం ఆమె బ్యాంకును ఆశ్రయించారు. స్థిరమైన ఆదాయం, మంచి క్రెడిట్ స్కోరు ఉన్నప్పటికీ.. ఆమెకు బ్యాంకులు రుణాన్ని తిరస్కరించాయి. కొన్ని బ్యాంకులు మాత్రం ఆమె అర్హత కంటే చాలా తక్కువ మొత్తాన్ని మాత్రమే మంజూరు చేయడానికి ముందుకొచ్చాయి. ఇది ఆమెను షాక్‌కు గురి చేసింది.
దీనికి కారణం తెలుసుకునే ప్రయత్నంలో ఆమెకు అసలు విషయం తెలిసింది. గతంలో భర్తతో కలిసి తీసుకున్న గృహరుణానికి ఆయన పలుమార్లు ఈఎంఐలు చెల్లించకపోవడంతో ఆ డిఫాల్ట్ అనేది ఆమె క్రెడిట్ రిపోర్టులో కూడా నమోదైంది. తాను ఒక్క రూపాయి బకాయి పెట్టకపోయినా.. ఉమ్మడి రుణం కారణంగా ఆమె క్రెడిట్ స్కోర్ తీవ్రంగా పడిపోయింది. చివరికి ఎన్నో వివరణలు, పత్రాలు సమర్పించిన తర్వాత రుణం లభించినా.. ఆశించిన మొత్తంలో కాకుండా చాలా తక్కువ మొత్తమే దక్కింది. దీంతో భర్త తప్పిదానికి భార్య మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

క్రెడిట్ స్కోర్‌ను నిర్ణయించేది చెల్లింపులే కాదు..
చాలా మంది క్రెడిట్ స్కోర్ అంటే తాము తీసుకున్న రుణాలు, చెల్లింపుల ఆధారంగా నిర్ణయిస్తారని భావిస్తారు. కానీ అది పూర్తిగా నిజం కాదని ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. రిసర్టెంట్ ఇండియా లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ జ్యోతి ప్రకాశ్ గడియా ప్రకారం.. ఒకరు సహ-రుణగ్రహీతగా లేదా గ్యారంటర్‌గా సంతకం చేస్తే.. ఆ రుణం చెల్లింపుల బాధ్యత చట్టపరంగా వారి పైనా ఉంటుంది. అసలు రుణగ్రహీత ఈఎంఐలు చెల్లిం చకపోతే దాని ప్రభావం అందరి క్రెడిట్ ప్రొఫైల్‌పై పడు తుంది. భవిష్యత్‌లో కొత్త రుణాలు పొందడం కూడా కష్టమవుతుంది.

కుటుంబాల్లోనే ఎక్కువగా ఈ సమస్యలు
జావో వ్యవస్థాపకుడు కుందన్ షాహి ప్రకారం.. కుటుంబ సభ్యుల మధ్య నమ్మకం ఎక్కువగా ఉండటంతో ఆర్థికపరమైన ప్రమాదాన్ని అంచనా వేయకుండా రుణా లకు సంతకాలు చేస్తుంటారు. కానీ బ్యాంకులు కుటుంబ సంబంధాలను పరిగణనలోకి తీసుకోవు. ఒప్పందంలో ఎవరి పేరు ఉందో వారినే బాధ్యులుగా చూస్తాయి.

గ్యారంటీగా ఉన్నాడు.. 
అప్పు కూడా చెల్లించాడు.. బంధాన్ని కోల్పోయాడు
ఒక బ్యాంకు ఉద్యోగి తన బావ తీసుకున్న కారు రుణానికి గ్యారంటీగా నిలిచాడు. కొంత కాలానికే బావ వ్యాపారంలో నష్టాలు వచ్చాయి. దీంతో కట్టాల్సిన ఈఎంఐలు ఆగిపోయాయి. దీంతో బ్యాంకు నేరుగా గ్యారంటీదారునే సంప్రదించింది. బావ ఆర్థికంగా చెల్లించే స్థితిలో లేకపోవడంతో చివరకు ఆయనే మొత్తం బకాయిని తీర్చాల్సి వచ్చింది. డబ్బు నష్టం మాత్రమే కాదనీ, కుటుంబ బంధాన్ని కూడా శాశ్వతంగా దెబ్బతీస్తుందని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ.

చట్టపరమైన చర్యలను అర్థం చేసుకోవాలి : నిపుణులు
ఇలాంటి అనుభవాల నేపథ్యంలో నిపుణులు కొన్ని విలువైన సూచనలు చేస్తున్నారు. ఒకరి రుణానికి సహ-రుణగ్రహీతగా, గ్యారంటీదారుగా మారే ముందు.. ‘రేపు ఆ వ్యక్తి రుణం చెల్లించకపోతే, నేను నా స్వంత డబ్బుతో మొత్తం అప్పు తీర్చగలనా?’ అనే ప్రశ్నకు సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుందనీ, ఒక వేళ కాదనుకుంటే రుణపత్రాలపై సంతకం చేయకుండా ఉండటమే మంచిదని వారు సూచిస్తున్నారు. కాబట్టి భావోద్వేగంతో కాకుండా, చట్టపరమైన బాధ్యతలను పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాతే సంతకాలు చేయడానికి ముందుకు రావాలని అంటున్నారు.

బంధం తెగినా.. బాధ్యత పోదు
భార్యాభర్తలు విడిపోయినా, కుటుంబ వివాదాలు వచ్చినా, గ్యారంటీ లేదా సహ-రుణగ్రహీత బాధ్యతలు స్వయంగా రద్దు కావు. బ్యాంకు అధికారికంగా విడుదల చేసినప్పుడే లేదా పూర్తిగా రుణం చెల్లించిన తర్వాతే బాధ్యత ముగుస్తుంది. లేదంటే చట్టపరంగా అప్పు బాధ్యత కొనసాగుతూనే ఉంటుందన్న విష యాన్ని నిపుణులు గుర్తు చేస్తున్నారు.

సహాయం చేయాలనే ఉద్దేశం.. భవిష్యత్తులో భారం
తల్లిదండ్రులు పిల్లల విద్యారుణాలకు సహ-దరఖాస్తుదారులుగా మారడం, భార్యాభర్తలు కలిసి గృహరుణాలు తీసుకోవడం, సోదరులు వ్యాపార రుణాల కు గ్యారంటీ ఇవ్వడం, స్నేహితులకు సహాయం చేయడం సాధారణ విషయాలే. కానీ బ్యాంకుల దృష్టిలో బంధు త్వం కాదు.. చట్టబద్ధమైన బాధ్యతే ముఖ్యం. రుణ ఒప్పం దంపై సంతకం చేసిన వ్యక్తి.. రుణగ్రహీత చెల్లింపులు నిలిపివేస్తే మొత్తం బాధ్యతను భరించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -