
– జంతు సంక్షేమ పక్షోత్సవాల్లో పాల్గొన్న జిల్లా వైద్యాధికారి డాక్టర్ కే. సింహరావ్
నవతెలంగాణ – మద్నూర్
జంతువులను హింసించ కూడదు, జంతువుల సంరక్షణ పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని పశు వైద్య శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న జంతు సంక్షేమ పక్షోత్సవాల్లో భాగంగా మంగళవారం నాడు మద్నూర్ మండల కేంద్రంలో పశు వైద్య శాఖ ఆధ్వర్యంలో పక్షోత్సవాలపై అవగాహన సదస్సు, క్యాలెండర్ల ఆవిష్కరణ, పెంపుడు కుక్కలకు రేబిన్ టీకాలు వేయడం వంటి కార్యక్రమాలు జిల్లా వైద్యాధికారి ఆధ్వర్యంలో నిర్వహించారు. మండల కేంద్రంలోని పశువైద్యశాలలో పెంపుడు కుక్కలకు రేబిన్ టీకాలు వేయించారు. ఆ తర్వాత బాలుర ఉన్నత పాఠశాల ఆవరణంలో జంతువుల సంరక్షణ పట్ల అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వైద్యాధికారి మాట్లాడుతూ జంతువుల సంరక్షణ పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని, జంతువు సంక్షేమానికి ప్రతి ఒక్కరూ కృషి చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని, సంక్షేమం పట్ల జాలి, దయ, కలిగి ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమాల్లో జిల్లా వైద్యాధికారి తో పాటు అసిస్టెంట్ డైరెక్టర్లు డాక్టర్ కే సంజయ్ కుమార్, డాక్టర్ రోహిత్ రెడ్డి, డాక్టర్ వెంకటేశ్వర రెడ్డి, మండల పశు వైద్యులు డాక్టర్ బండి వార్ విజయ్, పశువైద్య సిబ్బంది, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థినీ విద్యార్థులు, రైతులు పాల్గొన్నారు. పాఠశాల విద్యార్థులకు జంతు సంరక్షణ పట్ల పక్షోత్సవాల్లో భాగంగా అవగాహన కలిగించిన జిల్లా అధికారికి పాఠశాల ఉపాధ్యాయులు శాలువాతో ఘనంగా సన్మానించారు.