నవతెలంగాణ – బెజ్జంకి
యువజన కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధిగా మండల పరిధిలోని చీలాపూర్ గ్రామానికి చెందిన శానగొండ శ్రవణ్ నియమాకమైయ్యారు. శనివారం మానకొండూర్ నియోజకవర్గంలోని గన్నేరువరం మండల కేంద్రంలో నిర్వహించిన బూత్ స్థాయి సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ శ్రవణ్ కు నియమాకపత్రం అందజేశారు.తన నియమాకానికి సహకరించిన రాష్ట్ర రవాణ,బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్,ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, యువజన రాష్ట్రాధ్యక్షుడు శివసేన రెడ్డి, కరీంనగర్ జిల్లా యువజన అధ్యక్షులు పడాల రాహుల్, బెజ్జంకి మండల కాంగ్రెస్ నాయకులకు శ్రవణ్ కృతజ్ఞతలు తెలిపారు.