Saturday, May 30, 2026
E-PAPER
Homeఆటలుసింధు తొమ్మిదోసారి!

సింధు తొమ్మిదోసారి!

- Advertisement -

ఆన్‌ సె యంగ్ చేతిలో ఓటమి
సెమీస్‌‌లో సాత్విక్‌, చిరాగ్‌ జోడీ

సింగపూర్‌ ఓపెన్‌ సూపర్‌ 750

సింగపూర్‌ : భారత అగ్రశ్రేణి షట్లర్‌, రెండు సార్లు ఒలింపిక్‌ ‌పతక విజేత పి.వి సింధు టైటిల్‌ ‌వేటకు తెరపడింది. సింగపూర్‌ ఓపెన్‌ ‌సూపర్‌ 750 ‌టోర్నమెంట్‌ను దూకుడుగా ఆరంభించిన పి.వి సింధుకు క్వార్టర్‌‌ఫైనల్లో వరల్డ్‌ ‌నం.1, దక్ష‍ిణ కొరియా షట్లర్‌ ఆన్‌ ‌సె యంగ్‌ ‌చేతిలో ఓటమి తప్పలేదు. వరుసగా తొమ్మిదోసారి ఆన్‌ ‌సె యంగ్‌ ‌చేతిలో ఓడిన సింధు సింగపూర్‌ ఓపెన్‌ ‌నుంచి నిష్ర్కమించింది. 17-21, 14-21తో వరుస గేముల్లో ఓడిన సింధు.. 48 నిమిషాల్లోనే సెమీస్‌ ‌బెర్త్‌‌పై ఆశలు కోల్పోయింది. తొలి గేమ్‌‌లో 7-7 వరకు పోటీ ఇచ్చిన సింధు విరామ సమయానికి 7-11తో వెనుకంజ వేసింది. ద్వితీయార్థంలోనూ పుంజుకోవటంలో విఫలమైంది. కీలక రెండో గేమ్‌‌లో ఏ దశలోనూ ఆన్‌ ‌సె యంగ్‌‌కు సింధు సవాల్‌ ‌విసరలేదు. ఆది నుంచి ఆధిక్యంలో నిలిచిన దక్ష‍ిణ కొరియా షట్లర్‌ అదే జోరుతో రెండో గేమ్‌‌తో పాటు సెమీఫైనల్‌ బెర్త్‌‌ను దక్కించుకుంది. 2019 నుంచి పి.వి సింధుపై ఆన్‌ ‌సె యంగ్‌ ఓటమెరుగని రికార్డును కొనసాగిస్తోంది. ఇక పురుషుల సింగిల్స్‌‌లో వరల్డ్‌ ‌నం.10 లక్ష్యసేన్‌ ‌సైతం క్వార్టర్‌‌ఫైనల్లో నిరాశపరిచాడు. వరల్డ్‌ నం.19 జపాన్‌ ‌షట్లర్‌ ‌కొకి చేతిలో 19-21, 21-15, 15-21తో మూడు గేముల మ్యాచ్‌లో పోరాడి ఓడాడు. తొలి గేమ్‌‌లో ఆఖరు వరకు పోరాడిన లక్ష్యసేన్‌.. రెండో గేమ్‌‌ను సాధికారికంగా నెగ్గాడు. నిర్ణయాత్మక మూడో గేమ్‌‌లో మళ్లీ నిరాశపరిచి టోర్నమెంట్‌ నుంచి వైదొలిగాడు.

​సెమీస్‌‌లో సాత్విక్‌ ‌జోడీ
డబుల్స్‌‌లో వరల్డ్‌ ‌నం.4 సాత్విక్‌‌సాయిరాజ్‌ ‌రాంకిరెడ్డి, చిరాగ్‌ ‌శెట్టి జోడీ సెమీఫైనల్లోకి ప్రవేశించింది. మూడు గేముల పాటు సాగిన క్వార్టర్‌‌ఫైనల్లో సాత్విక్‌, చిరాగ్‌‌లు 19-21తో తొలి గేమ్‌‌ను తృటిలో చేజార్చుకున్నారు. కానీ తర్వాత వరుస గేముల్లో సాత్విక్‌, చిరాగ్‌‌లు సత్తా చాటారు. 21-17, 21-13తో మలేషియా షట్లర్లపై మెరుపు విజయం సాధించారు. రెండో గేమ్‌‌లో 16-16 వరకు పోటీ రసవత్తరంగా సాగినా.. నిర్ణయాత్మక మూడో గేమ్‌ ‌సాత్విక్‌, చిరాగ్‌ ‌దూకుడుతో ఏకపక్ష‍ంగా సాగింది. మిక్స్‌‌డ్‌ ‌డబుల్స్‌‌లో ధ్రువ్‌ ‌కపిల, తనీశ క్రాస్ట్రోలు సైతం సెమీస్‌‌లోకి చేరుకున్నారు. క్వార్టర్‌‌ఫైనల్లో వరల్డ్‌ ‌నం.4 మలేషియా జోడీ చెన్‌, ఈవేలు తొలి గేమ్‌‌లో 18-16తో ముందంజలో నిలిచినా.. ఫిట్‌‌నెస్‌ ‌సమస్యతో పోటీ నుంచి తప్పకున్నారు. దీంతో కపిల, క్రాస్టోలు సెమీఫైనల్‌‌కు చేరుకున్నారు. నేడు సెమీఫైనల్లో టాప్‌ ‌సీడ్‌ ‌దక్ష‍ిణ కొరియా షట్లర్లతో సాత్విక్‌, చిరాగ్‌ ‌పోటీపడనుండగా.. జపాన్‌ ‌జంటతో కపిల, తనీశ ఢీకొట్టనున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -