31 వరకు రెండు జిల్లాల్లో నిర్వహణ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తమిళనాడులోని అరియలూరు జిల్లాలో సోమవారం ఉప-జాతీయ మలేరియా నిర్మూలన్ర ధ్రువీకరణ కార్యక్రమం (ఎస్‌ఎన్‌ఎమ్‌ఈవీ) మొదలైంది. మలేరియా నిర్మూలన దిశగా సాధించిన పురోగతిని అంచనా వేసి ధ్రువీకరించడానికి, మలేరియాను నిర్మూలించడానికి సోమ, మంగళ, బుధవారాల్లో అరియలూరు జిల్లాలో, గురు, శుక్రవారాల్లో కడలూరు జిల్లాల్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ ధ్రువీకరణ బృందంలో ఎన్‌సీవీబీడీసీ అదనపు డైరెక్టర్, ప్రోగ్రామ్ అధికారి డాక్టర్ కె.పద్మజ, కన్సల్టెంట్ డాక్టర్ స్నేహ(ఛత్తీస్‌గఢ్), ప్రాంతీయ కన్సల్టెంట్ అధికారి డాక్టర్ శశి(కేరళ), ఎన్‌సీవీబీడీసీ అదనపు డైరెక్టర్ డాక్టర్ సౌకత్ కమల్(న్యూఢిల్లీ) ఉన్నారు. తొలిరోజు కార్యక్రమంలో డీన్ డాక్టర్ కుమారన్, జనరల్ మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ ఆకాష్, జిల్లా ఆరోగ్య అధికారి డాక్టర్ రామ్ గణేష్, మున్సిపల్ ఆరోగ్య అధికారి డాక్టర్ అరవింద్, డాక్టర్ మధియా అరస్ అలగన్, జిల్లా మలేరియా అధికారి డాక్టర్ కృష్ణమూర్తి, కీటక శాస్త్రవేత్త శ్రీమతి కేథరీన్, పాథాలజిస్టులు డాక్టర్ ప్రశాంతి, డాక్టర్ ప్రేమ్ కుమారి, సంబంధిత వైద్య కళాశాలల నుంచి మైక్రోబయాలజీ నిపుణులు, మలేరియా కార్యక్రమ సిబ్బంది, ఆరోగ్య ఇన్‌స్పెక్టర్లు పాల్గొన్నారు. మలేరియా కట్టడికి తీసుకుంటున్న చర్యలు, కేసుల గుర్తింపు, చికిత్స, వర్గీకరణ, ప్రయోగశాల నిర్ధారణ సామర్థ్యం , నాణ్యతా హామీ యంత్రాంగాలు, చికిత్సా పద్ధతులు, వాహక దోమలపై నియంత్రణ చర్యలు, తదితర అంశాలపై సమగ్రంగా చర్చిం చారు. అరియలూరు ఆస్పత్రిలో పాథాలజీ, మైక్రోబయాలజీ ప్రయోగ శాలలు, ఔట్‌పేషెంట్ విభాగం, ఫీవర్ వార్డులను బృంద సభ్యులు తనిఖీ చేశారు. స్థానికంగా సంక్రమించిన మలేరియా కేసులను తక్షణమే గుర్తించడానికి, దర్యాప్తు చేయడానికి, వర్గీకరించ డానికి, స్పందించడానికి ఆరోగ్య వ్యవస్థ యొక్క సంసిద్ధతపై ఆరా తీశారు.
ఐదు రోజుల పాటు తమిళనాడులో ఎస్‌ఎన్‌ఎమ్‌ఈవీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



