Tuesday, July 28, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంనేడు, రేపు పలు జిల్లాలకు భారీ వర్షసూచన!

నేడు, రేపు పలు జిల్లాలకు భారీ వర్షసూచన!

- Advertisement -


సోమవారం 311 ప్రాంతాల్లో వర్షపాతం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

రాష్ట్రంలో మంగళ, బుధవారాల్లో ఆయా జిల్లాల్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే సూచనలున్నాయని హైదరాబాద్‌ ‌వాతావరణ కేంద్రం ప్రధాన అధికారి ఎస్‌. స్టెల్లా తెలిపారు. ఈ మేరకు ఆదిలాబాద్‌, కొమ్రంభీమ్‌ అసిఫాబాద్‌, మంచిర్యాల, జయశంకర్‌ ‌భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు ఎల్లో హెచ్చరిక జారీ చేశారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఉపరితల గాలులు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే సూచనలున్నాయని తెలిపారు. గ్రేటర్‌ ‌హైదరాబాద్‌ ‌పరిధిలో వచ్చే 48 గంటల పాటు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం పడే సూచనలున్నాయని పేర్కొన్నారు.
రాష్ట్రంలో సోమవారం ఉదయం 8:30 గంటల నుంచి రాత్రి పది గంటల వరకు 311 ప్రాంతాల్లో వర్షపాతం నమోదైంది. మెదక్‌ ‌జిల్లా కేంద్రంలో అత్యధికంగా 6.7 సెంటీమీటర్ల భారీ వర్షం కురిసింది.

అత్యధిక వర్షపాతం నమోదైన ప్రాంతాలు
మెదక్‌ 6.70 సెంటీమీటర్లు
శంకరంపేట(‌మెదక్‌) 5.79 సెంటీమీటర్లు
పొడిచాన్‌‌పల్లి(మెదక్‌) 5.60 సెంటీమీటర్లు
చేగుంట(మెదక్‌) 5.00 సెంటీమీటర్లు
జూలూరుపాడు(భద్రాద్రి కొత్తగూడెం) 4.75 సెంటీమీటర్లు
గాంధారి(కామారెడ్డి) 4.50 సెంటీమీటర్లు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -