కబ్జా చేసిన భూముల్లో మట్టిని తొలగించాలి..

– కబ్జా దారులకు నోటిసులు అందజేత..
నవతెలంగాణ – డిచ్ పల్లి
ఇందల్ వాయి మండలంలోని ఇందల్ వాయి గ్రామంలోని చేద్దాం చెరువుకు ఆనుకొని కొందరు కబ్జాలు చేసి మట్టి వసి సాగు చేసుకుంటున్నారని ఫిర్యాదు మేరకు ఇరిగేషన్ శాఖ ఏఈ మాదవి, మండల రెవెన్యూ అధికారి మోహన్, ఎంపిటిసి మారంపల్లి సుధాకర్ తోపాటు గ్రామ అభివృద్ది కమిటీ సభ్యులు ఇతరులతో కలిసి శుక్రవారం చెరువును, అక్రమాలకు గురైన భూములను పరిశీలించి చెరువు భూములను కబ్జా చేసిన వారికి నోటీసులను అందజేసినట్లు వారు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చెరువుకు ఆనుకొని ఉన్న వారు కొందరు భూములను ఆక్రమించారని వచ్చిన ఫిర్యాదు మేరకు ఆ భూములను అధికారులతో కలిసి పరిశీలించగా కబ్జాకు గురైన మాట వాస్తవమేనని ఈ సందర్భంగా కబ్జా చేసినవారికి నోటీసులను అందజేశామని ఎక్కడైతే చెరువు భూమిని కబ్జా చేసి  మట్టివేసి అభివృద్ధి చేశారో గతంలాగా యధావిధిగా ఉంచాలని లేకపోతే అలాంటి వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని వారు ఇచ్చిన నోటీసులో హెచ్చరించారు

Spread the love