సంబరాలు కాదు… సమస్యలు పరిష్కరించండి

నవతెలంగాణ-బయ్యారం
తెలంగాణ ఆవిర్భావ సంబరాలు జరపమని అధికారులకు హుకుం జారీ చే సిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి కూలీల సమస్యలను ఏ మాత్రం పట్టిం చుకోకుండా వ్యవహరిస్తుందని అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర కోశాధికా రి నందగిరి వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని విమర్శించారు. శుక్రవారం మండలంలోని బా లాజీపేట వరదయ్య కుంటలో పని చేస్తున్న ఉపాధి కూలీల పని ప్రదేశాన్ని సందర్శించి, కూలీల సమస్యలను తెలుసుకోవడం జరిగింది. ఉపాధి కూలీలు మా ట్లాడుతూ కనీస వేతనాన్ని కూడా అమలు చేయకుండా, రోజుకు 100 నుండి 150 రూపాయల లోపే వేతనం వస్తుందని,అవి కూడా ప్రతి వారం వారం చెల్లిం చకపోవడం వలన అనేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నామన్నారు. పని ప్రదేశంలో కనీస సౌకర్యాలు మంచినీరు, నీడ, ప్రాథమిక వైద్య కిట్టు సౌకర్యాలు లేవన్నారు. పారా గడ్డపారలు ఇవ్వడం లేదన్నారు. ఈ సందర్భంగా నందగిరి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ వ్యవసాయ కూలీలకు, వలస కూలీలకు కొంత జీవనోపాధిగా ఉన్న గ్రామీణ ఉపాధి హామీ పథకానికి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో నిధులను తగ్గిస్తూ క్రమక్రమంగా ఈ పథకాన్ని ఎత్తి వేయుటకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు కొన సాగిస్తుందని విమర్శించారు. ఉపాధి హామీ పథకానికి చట్టపరంగా ఉన్న హక్కు లను ఏ ఒక్కటి కూడా సక్రమంగా అమలు చేయడం లేదని అమలు చేయమని అడిగినా పట్టించుకునే నాధుడే లేడని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని సక్రమంగా కొనసాగించాలని తగిన నిధులు కేటాయించాలని, కనీస వేతన చట్టాన్ని అమలు చేస్తూ రోజు కూలి 600 రూపాయలు ఇవ్వాలని పని ప్రదేశంలో కనీస సౌకర్యాలు కల్పించి, ప్రతివారం వేతనాలు చెల్లించాలని, పెం డింగ్‌ వేతనాలను వెంటనే చెల్లించాలని ప్రమాదాలకు గురైన ఉపాధి కూలీలకు వైద్య సదుపాయం కల్పిస్తూ, సెలవులతో కూడిన వేతనాన్ని అందించాలని డిమాం డ్‌ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సమస్యలను పరిష్కరించకుండా ఆవిర్భావ సంబరాలు జరపమని పిలుపునివ్వడం తెలంగాణ రాష్ట్రం కోసం ఆత్మ బలిదానాలు చేసిన అమరవీరులకు ద్రోహం చేయడమేనని అన్నారు. యువతకు ఉద్యోగ అవకాశాలులేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, వ్యవసాయం చేస్తున్న రైతులకు గిట్టుబాటు కాక ఆత్మహత్యల పరంపర కొనసాగుతోందని, కార్మిక చట్టా లను సవరిస్తూ కార్మికుల కనీస హక్కులను కాలరాశి వేస్తూ చట్టాలు చేస్తున్నారని, ఇందుకేనా దశాబ్ది ఆవిర్భావ సంబరాలు జరుపుకోవాలని కెసిఆర్‌ ప్రభుత్వం ఆదే శించడని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి బంగారు తెలంగాణ పేరుతో ప్రజలకు బ్రతుకుతెరువులేని తెలం గాణగా మారుస్తున్నందుకా సంబరాలు జరపడం అని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆత్మ బలిదానాలు చేసిన అమరుల త్యాగాల పోరాట స్ఫూర్తి తో కెసిఆర్‌ నియంత పాలనకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రజల ఆకాంక్షల సాధన కై మరో పోరాటానికి సిద్ధంగా కావాలని ప్రజలకు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమం లో ఏఐకేఎంఎస్‌ ప్రధాన కార్యదర్శి తోకల వెంకన్న, ఎస్‌ సునీత, కొత్త రామదాసు, ఎర్రమళ్ళ వెంకన్న, నిమ్మరబోయిన సహదేవ్‌, రాంబాయి, మంగమ్మ, వేల్పుల సీత, గంగారబోయిన వెంకన్న, గణేష్‌, జయమ్మ తదితరులు పాల్గొన్నారు.

Spread the love