Saturday, May 23, 2026
E-PAPER
Homeఆదిలాబాద్లారీలు రాక జొన్న రైతుల ఆందోళన

లారీలు రాక జొన్న రైతుల ఆందోళన

- Advertisement -

నవతెలంగాణ – బజార్హత్నూర్
బజార్హత్నూర్ జొన్నల మార్కెట్ సహకార సంఘంలో రైతుల ఆందోళన ఉద్రిక్తంగా మారింది. మండలంలోని రైతుల జొన్నలను కాటా చేసి ఎనిమిది రోజులు గడిచినా ఇప్పటివరకు ఒక్క లారీ కూడా మార్కెట్‌కు రాకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అకాల వర్షాల కారణంగా మార్కెట్ యార్డులో నిల్వ ఉంచిన జొన్న సంచులు తడుస్తుండటంతో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ నేపథ్యంలో రైతులు బజార్హత్నూర్ సహకార సంఘాన్ని ముట్టడి చేసి నిరసన తెలిపారు. అనంతరం సీఓ నారాయణకు వినతిపత్రం అందజేసి తమ సమస్యను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. తక్షణమే కనీసం 12 లారీలను ఏర్పాటు చేసి జొన్న సంచులను లోడింగ్ చేయాలని రైతులు డిమాండ్ చేశారు. ప్రతిరోజూ మార్కెట్ చుట్టూ తిరగాల్సి రావడంతో వ్యవసాయ పనులు కూడా నిలిచిపోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని రైతులు కోరుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -