వికలాంగుల హక్కుల పరిరక్షణకు
ప్రభుత్వం కట్టుబడి ఉండాలి : ఎన్‌పీఆర్‌డీ రాష్ట్ర అధ్యక్షులు కె. వెంకట్హె లెన్ కెల్లర్‌కు నివాళులు
నవతెలంగాణ – ముషీరాబాద్
ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలకు స్పెషల్ ఎడ్యుకేషన్ పొందడం వారి ప్రాథమిక హక్కు అని, వికలాంగుల సంక్షేమం, సాధికారత, హక్కుల పరిరక్షణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరింత బాధ్యతతో వ్యవహరించాలని ఎన్‌పీఆర్‌డీ రాష్ట్ర అధ్యక్షులు కె.వెంకట్ అన్నారు. హెలెన్ కెల్లర్ 146వ జయంతి సందర్భంగా శనివారం హైదరాబాద్ చిక్కడపల్లిలోని ఎన్‌పీఆర్‌డీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో హెలెన్ కెల్లర్ చిత్రపటానికి రాష్ట్ర అధ్యక్షులు కె. వెంకట్, ప్రధాన కార్యదర్శి ఎం.అడివయ్య, కోశాధికారి ఆర్.వెంకటేష్, రాష్ట్ర కమిటీ సభ్యులు పి.శశికల, రాజు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వెంకట్ మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా 109 దేశాల్లో 110 కోట్ల మంది పేదరికంలో జీవిస్తున్నారని, భారతదేశంలో 7.5 కోట్ల మంది అత్యంత పేదరికంలో ఉన్నారని తెలిపారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం ప్రపంచంలో 150 కోట్ల మందికి ఏదో ఒక రకమైన వినికిడి లోపం ఉండగా, 43 కోట్ల మందికి తీవ్రమైన వినికిడి సమస్య ఉందన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో 50.7 లక్షల మంది, తెలంగాణలో 1.1 లక్షల మంది వినికిడి లోపంతో బాధపడుతున్నారని చెప్పారు. అలాగే దేశంలో 49.5 లక్షల మంది పూర్తిగా అంధులుగా ఉండగా, సుమారు 7 కోట్ల మందికి ఏదో ఒక రకమైన దృష్టిలోపం ఉందన్నారు. వినికిడి లోపం నివారణ, బధిరుల అభివృద్ధి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. బధిరుల కోసం ఇండియన్ సైన్ లాంగ్వేజ్ అభివృద్ధిలో ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని, దీనిపై ఉద్యమాలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు.
ఎం.అడివయ్య మాట్లాడుతూ.. హెలెన్ కెల్లర్ జీవితం వికలాంగుల హక్కుల ఉద్యమాలకు దిక్సూచిగా నిలిచిందన్నారు. వికలాంగులకు విద్య, ఉపాధి అవకాశాలు, సమాన హక్కుల కోసం వారు చేసిన పోరాటం నేటి తరానికి ఆదర్శమని చెప్పారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాల ప్రకారం 2050 నాటికి ప్రతి నలుగురిలో ఒకరు వినికిడి సమస్యతో బాధపడే అవకాశం ఉందని, ఈ నేపథ్యంలో ప్రత్యేక విద్య, వైద్య సేవలు, పునరావాస కార్యక్రమాలను విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్ర కోశాధికారి ఆర్. వెంకటేష్ మాట్లాడుతూ.. ప్రభుత్వ, ప్రయివేటు, ఎయిడెడ్ విద్యాసంస్థల్లో స్పెషల్ టీచర్లను నియమించాలని, ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులకు నాణ్యమైన విద్య అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
స్పెషల్ ఎడ్యుకేషన్ వికలాంగుల హక్కు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



