ఆరోగ్య ఉప కేంద్రాన్ని తనిఖీ చేసిన స్పెషల్ అధికారి

నవతెలంగాణ – మల్హర్ రావు.
మండలంలోని ఆన్ సాన్ పల్లి గ్రామంలో ప్రభుత్వ ఆరోగ్య ఉప కేంద్రాన్ని భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భవేస్ మిశ్రా ఆదేశాల మేరకు శనివారం మండల స్పెషల్ అధికారి అవినాష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రోజువారీ సిబ్బంది హాజరు రిజిస్టర్, మందులు, ఉప కేంద్రంలో మౌలిక వసతులపై అరా తీశారు. వైద్య సిబ్బంది సమయ పాలన పాటించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు.
Spread the love