నిబంధనలు ఉల్లంఘిస్తున్న విద్యా సంస్థల గుర్తింపు రద్దు చేయాలి
ఎన్‌పీఆర్‌డీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.అడివయ్య
కలెక్టరేట్ ఎదుట ధర్నా
నవతెలంగాణ-మెదక్ ప్రాంతీయ ప్రతినిధి
ప్రయివేటు, సీబీఎస్‌ఈ విద్యా సంస్థల్లో స్పెషల్ టీచర్స్‌ను నియమిం చాలని, నిబంధనలు ఉల్లంఘిస్తున్న విద్యా సంస్థల గుర్తింపు రద్దు చేయాలని ఎన్‌పీఆర్‌డీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.అడివయ్య డిమాండ్ చేశారు. ప్రయివేటు, కార్పొరేట్, ఎయిడెడ్ విద్యా సంస్థల్లో స్పెషల్ టీచర్స్‌ను నియ మించాలని డిమాండ్ చేస్తూ వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (ఎన్‌పీ ఆర్‌డీ) సంగారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టర్ కార్యాలయం ఏఓ విజయలక్ష్మికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. సంగారెడ్డి జిల్లాలోని ప్రయివేటు విద్యా సంస్థల్లో స్పెషల్ టీచర్స్‌ను నియమించే విధంగా చర్యలు తీసుకోవాలని, ర్యాంపులు నిర్మించాలని డిమాండ్ చేశారు. జిల్లాలో సంగారెడ్డి, పటాన్‌చెరు, జహీరాబాద్, సదాశివపేట, జోగిపేట, నారాయణఖేడ్ ప్రాంతాల్లో వందలాది స్టేట్ బోర్డు, సెంట్రల్ బోర్డ్ ప్రయివేట్ విద్యా సంస్థలు న్నాయని అన్నారు. 2016 వికలాంగుల హక్కుల పరిరక్షణ చట్టం సెక్షన్ 16,17 జీఓ యం.ఎస్.నెం 3, 01.05.2018 ప్రకారం ప్రభుత్వ గుర్తింపు పొందిన విద్యా సంస్థలు అంగవైకల్యం కలిగిన పిల్లలకు సమగ్ర విద్య అందించాలని ఉందని తెలిపారు.
వారికి ప్రత్యేక బోధన కోసం ప్రత్యేకంగా శిక్షణ పొందిన ఉపాధ్యాయులను అందుబాటులో ఉంచాలని నిబంధనలు ఉన్నా ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. సీబీఎస్‌ఈ ఆఫిలియే షన్ బై లా 2024 మార్గదర్శకాల ప్రకారం ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థుల కోసం ఇంక్లూసీవ్ ఎడ్యుకేషన్ సౌకర్యాలు కల్పించడంతో పాటు స్పెషల్ ఎడ్యుకేటర్లను నియమించాలని నిబంధనలు ఉన్నప్పటికీ జిల్లాలో ఉన్న విద్యా సంస్థల్లో అమలు కావడం లేదన్నారు. ప్రయివేట్ విద్యా సంస్థలు బహుళ అంతస్థుల్లో నడుపుతున్నాయని, ఏ విద్యా సంస్థలో కూడా లిఫ్ట్, ర్యాంపు సౌకర్యం లేదని, ప్రయివేట్ విద్యా సంస్థలు అంగవైకల్యం కలిగిన పిల్లలకు ప్రవేశం కల్పించడంతో పాటు స్పెషల్ ఎడ్యుకేటర్, రిసోర్స్ టీచర్స్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఇండివిడ్యువల్ ఎడ్యుకేషన్ ప్లాన్, బ్రెయిలీ, సైన్ లాంగ్వేజ్ బోధన పద్ధతులను అమలు చేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని నిబంధనలు ఉన్నా అమలు కావడం లేదని విమర్శించారు. ప్రయివేట్ విద్యా సంస్థల్లో స్పెషల్ టీచర్స్‌ను నియమించేంత వరకూ ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎన్‌పీఆర్‌డీ సంగారెడ్డి జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎం.బస్వరాజు, నర్సిములు, రాష్ట్ర కమిటీ సభ్యులు జయలక్ష్మి, జిల్లా ఉపాధ్యక్షులు రాంచందర్, రాజు, సహాయ కార్యదర్శులు కృపవర్, మచ్చేందర్, వెంకన్న జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ప్రయివేటు, సీబీఎస్‌ఈ విద్యా సంస్థల్లో స్పెషల్ టీచర్స్‌ను నియమించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



