టీచర్లకు ప్రత్యేక టెట్‌ నిర్వహించాలి

– టీఎస్‌యూటీఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావా రవి
– ఇబ్రహీంపట్నంలో 11వ ఆవిర్భావ వార్షికోత్సవ దినోత్సవం
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
టీచర్లకు ప్రభుత్వం ప్రత్యేక టెట్‌ నిర్వహించాలని టీఎస్‌యూటీఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావా రవి డిమాండ్‌ చేశారు. టీఎస్‌యూటీఎఫ్‌ 11వ ఆవిర్భావ దినోత్సవాన్ని రంగారెడ్డి జిల్లా ఇబ్రహీం పట్నం మండల కేంద్రంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాటా ్లడుతూ.. ఉపాధ్యాయ సమస్యలపై యూటీఎఫ్‌ రాజీలేని పోరాటాలు నిర్వహిస్తోందని చెప్పారు. స్పెషల్‌ విద్యావాలంటీర్లను ఉపాధ్యాయులు గా గుర్తింపును సాధించిన ఘనత యూటీఎఫ్‌ సంఘానిదేన్నారు. అప్రెంటీస్‌ విధానాన్ని రద్దు చేసే వరకూ ఆమరణ దీక్ష వంటి రాజీలేని పోరాటాలు నిర్వహించిందన్నారు. సీపీఎస్‌ అంతమయ్యే వరకు ఉపాధ్యాయ లోకమంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు. ఉపాధ్యాయుల కుటుంబ క్షేమం కోసం ఫ్యామిలీ వెల్ఫేర్‌ ఫండ్‌ అనే సంస్థను ఏర్పాటు చేసిందన్నారు.
దురదృష్టవశాత్తు ప్రాణాలు కోల్పోయిన 22 మంది ఉపాధ్యాయులకు ఒక్కో కుటుంబానికి రూ.ఆరు లక్షలుగా ఇప్పటి వరకు రూ.కోటీ 32 లక్షలు సహాయం అందించి కొండంత అండగా నిలిచిందన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయులు రిటైర్మెంట్‌ గురించి 33సంవత్సరాలు, 61 సంవత్సరాల వయస్సుకు సంబంధించిన వార్త అవాస్తవమన్నారు.
అనంతరం సభలో పాల్గొన్న ప్రతినిధులకు అంబేద్కర్‌, జ్యోతిరావ్‌బాఫూలే పుస్తకాలు, మెమెంటో అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి గాలయ్య, రాష్ట్ర కమిటీ సభ్యులు సుగంధ, జిల్లా కార్యదర్శి కిషన్‌ చౌహాన్‌, రామకృష్ణా, జగన్నాథ శర్మ, నాగేంద్రం, అర్జున్‌రెడ్డి, కల్పన, శ్యామల, కృష్ణ కుమారి, భాగ్యశ్రీ, మండల నాయకులు కిరణ్‌కుమార్‌, జహీర్‌, బాలునాయక్‌, నర్సింహా, అంజయ్య, సుభాష్‌, సుమలత, పుష్ప, రవి, శ్రీనివాస్‌, ఆనంద్‌, లక్ష్మన్‌నాయక్‌, తదితరులు పాల్గొన్నారు.

Spread the love