జీవితంలో క్రీడలు ఒక భాగంగా ఉండాలి

జీవితంలో క్రీడలు ఒక భాగంగా ఉండాలి– యువకుల్లో స్నేహభావం పెంపొందింపు
– ఇబ్రహీంపట్నం ఏసీపీ శ్రీనివాస్‌రావు, మంచాల మాజీ జడ్పీటీసీ పగడాల యాదయ్య
నవతెలంగాణ-మంచాల
క్రీడలు జీవితంలో ఒక భాగంగా ఉండాలని, అవి యువకుల్లో స్నేహ భావాన్ని పెందిస్తాయని ఇబ్రహీంపట్నం ఏసీపీ. శ్రీనివాస్‌రావు, మాజీ జడ్పీటీసీ పగడాల యాదయ్య అన్నారు. మంగళవారం రాత్రి మండల పరిధిలోని చెన్న రెడ్డిగూడలో డీవైఎఫ్‌ఐ, ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ సందర్భంగా క్రీడల ముగింపు సభ జరిగింది. ఈ సందర్భంగా పాల్గొన్న వారు మీడియాతో మాట్లాడుతూ డీవైఎఫ్‌ఐ, ఎస్‌ఎఫ్‌ఐ చెన్నరెడ్డిగూడ గ్రామ కమిటీల ఆధ్వర్యంలో నిర్వ హించిన సంక్రాంతి క్రీడోత్సవాలు 12,13,14,15 తేదీల్లో క్రికెట్‌, వాలీబాల్‌, కబ్బడ్డీ, ముగ్గుల, టగ్గాపార్‌ నిర్వహించినట్టు తెలిపారు. అనంతరం గెలుపొందిన వారికి బహుమతులు అందజేసినట్టు తెలిపారు. ప్రతి యువకుడు చదువుతో పాటు క్రీడలపై ఆసక్తి చూపుతూ తమ భవిష్యత్‌కు బంగారు బాటలు వేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐ రవినాయక్‌, రామకృష్ణ, రైతు సంఘం జిల్లా నాయకులు కర్నాటి శ్రీనివాస్‌ రెడ్డి, జేనిగపాండు, వివిధ ప్రజా సంఘాల నాయకులు క్రీడా కారులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ గ్రామ పంచాయతీ వర్కర్స్‌ రాష్ట్ర అధ్యక్షులు గ్యార పాండు, రైతు సంఘం జిల్లా నాయకులు పి.వెంకటేష్‌, జర్నలిస్టు జె.పాండు, డీవైఎఫ్‌ఐ మండల కార్యదర్శి ఆర్‌.స్వామి, డీవైఎఫ్‌ఐ గ్రామాధ్యక్ష, కార్యదర్శులు ఆర్‌. మొతిలాల్‌, పి.ప్రహ్లాద్‌, ఐద్వా మండల నాయకులు పి.విజయ, జీ.సబిత, ఆర్గనైజర్స్‌ జీ. సుధాకర్‌, కే.హతిరాం, జే.పాండు, ఆర్‌.కిషన్‌, ఏ. రాజేందర్‌, ఆర్‌.వినోద్‌, పి.ప్రవీణ్‌, జే.క్రాంతి, జే.అరుణ్‌, ఆర్‌.మోహన్‌, డీవైఎఫ్‌ఐ గ్రామ నాయ కులు పి.కృష్ణ, పి.జంగయ్య, సీహెచ్‌.పరమేశ్‌, కే.రవి, కే.సురేష్‌, కే.దేవరాం, బి.హనుమంతు, బి. విష్ణు, ఆర్‌.రమేష్‌, ఆర్‌. పరమేష్‌, ఏ.కిషన్‌, ఏ. వినోద్‌, ఆర్‌.శ్రీదర్‌, శివ, సురేష్‌, దత్త పాల్గొన్నారు.

Spread the love