మెడికో హెల్త్ కేర్ కి ఎంపికైన శ్రీ చైతన్య డిగ్రీ  విద్యార్థులు

నవతెలంగాణ – కరీంనగర్ 
స్థానిక మంకమ్మతోటలోని శ్రీ చైతన్య డిగ్రీ, పిజీ కళాశాలలో మెడికో హెల్త్ కేర్ సర్వీస్ కంపెనీ వారు మంగళవారం రోజు నిర్వహించిన క్యాంపస్ డ్రైవ్ కి  విశేష స్పందన లభించిందని కళాశాల చైర్మన్ ముద్దసాని రమేష్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ 110 మంది చివరి సంవత్సరం విద్యార్థులు పాల్గొన్న ఈ ఇంటర్వూలో వివిధ దశలలో  జరిగిన ఎంపిక ప్రక్రియలో 21 మంది విద్యార్థులు ఉద్యోగాలు సాధించారని, వారికి వార్షిక వేతనం 2.5 లక్షలు ఉంటుందని తెలిపారు, విద్యార్థులకు ఉద్యోగ కల్పనే ద్యేయంగా తమ సంస్థ పనిచేస్తుందని, ప్రతి విద్యా సంవత్సరంలో దాదాపు 100 మంది శ్రీ చైతన్య డిగ్రీ విద్యార్థులు బహుళ జాతి సంస్థలకు ఎంపికవడమే దీనికి నిదర్శనం అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్స్ డా ఎల్ శ్రీనివాస్, డా వి స్వర్ణలత, వైస్ ప్రిన్సిపాల్ ఎస్ కృష్ణారెడ్డి కళాశాల సిబ్బంది, కంపెనీ ప్రతినిధులు  విద్యార్ధిని విద్యార్థులు పాల్గొన్నారు.
Spread the love