నవతెలంగాణ – బెజ్జంకి
మండల నూతన తహసీల్దార్ గా ఉట్కూరీ శ్రీనివాస్ రెడ్డి శనివారం బాధ్యతలు స్వీకరించారు. దూళ్మిట్ట మండల తహసీల్దార్ గా విధులు నిర్వర్తించి బెజ్జంకి మండల తహసీల్దార్ గా శ్రీనివాస్ రెడ్డి బదిలీ అయ్యారు. బెజ్జంకి తహసీల్దార్ గా విధులు నిర్వర్తించిన ఎర్రోల్ల శ్యామ్ దూళ్మిట్ట తహసిల్దార్ గా బదిలీపై వెళ్లారు. నూతన తహసీల్దార్ కు కార్యాలయ సిబ్బంది పుష్పగుచ్ఛం అందించి శాలువా కప్పి స్వాగతం పలికారు.