నల్లవెల్లి సోసైటీ ఛైర్మన్ గా శ్రీనివాస్ రెడ్డి భాద్యతల స్వీకరణ..

నవతెలంగాణ – డిచ్ పల్లి
ఇందల్ వాయి మండలంలోని నల్లవెల్లి సహకార సొసైటీ చైర్మన్ గా నోముల శ్రీనివాస్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికై భద్యతలనూ స్వీకరించారు.

జిల్లా సహకార సంఘ ఎన్నికల కార్యాలయ అసిస్టెంట్ రిజిస్టర్ పీ మురళి పాల్గొని చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి  నియామకపు పత్రాన్ని సోమవారం   అందజేశారు.ఐడిసిఎంఎస్, సహకార సొసైటీ చైర్మన్ గా ఉన్న సాంబార్ మోహన్ ఎప్రిల్19న అవిశ్వాస తీర్మానం పై చర్చా, సమావేశం ఏర్పాటు చేసినప్పుడు అరగంట ముందు చైర్మన్ సాంబార్ మోహన్ చైర్మన్ తన పదవికి రాజీనామా లేఖ ను‌ సమర్పించారు.వేంటనే దాన్ని ఆమోదించినట్లు అనాడు అదికారులు తెలిపారు. రాజినామా తో ఖాలి అయిన చైర్మన్ స్థానానికి ఇంచార్జీ చైర్మన్ గా ప్రస్తుతం వైస్ చైర్మన్ గా ఉన్న రమేష్ కు తాత్కాలిక చైర్మన్ గా భాద్యతలను అప్పగించారు. 9మంది డైరెక్టర్లు  బలనిరూపణ పరీక్ష ఉదయం 10గంటలకు ఉండటంతో సమయానికి డైరెక్టర్లు సహకార సొసైటీ కి చేరుకున్నారు. ముందుగా చైర్మన్ గా పోటీ చేస్తున్న శ్రీనివాస్ రెడ్డి తన నామినేషన్ను దాఖలు చేశారు.  ఇతర నామినేషన్ రాకపోవడంతో శ్రీనివాస్ రెడ్డి ఎకగ్రీవంగా చైర్మన్గా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి మురళి ప్రకటించి నియామకాపు పత్రాన్ని అందజేశారు.
ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి సహకారం తో అబివృద్ధి చేస్తాం: చైర్మన్ నోముల శ్రీనివాస్ రెడ్డి..
నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి అద్వర్యంలో నల్లవెల్లి సహకార సొసైటీ ని అన్నీ రంగాల్లో అభివృద్ధి  సాధిస్తూ, రైతులకు ఎళ్ళవేళల అందుబాటులో ఉంటానని,తనపై నమ్మకం ఉంచి చైర్మన్ చేసిన తోటి డైరెక్టర్లకు, సహకరించిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు ధన్యవాదాలు తెలుపుతున్నానని, రైతుల అవసరాల మేరకు విత్తనాలను, ఎరువులను, పంట రుణాలు, ఇతరత్రా వాటికి అందుబాటులో ఉండే విధంగా చర్యలు చేపడతానని పేర్కొన్నారు.
తరలివచ్చిన కాంగ్రెస్ శ్రేణులు..
నల్లవెల్లి సహకార సొసైటీ చైర్మన్ గా నోముల శ్రీనివాస్ రెడ్డి బాధ్యతలు స్వీకరిస్తా కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మోత్కూరి నవీన్ గౌడ్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు చిన్నారెడ్డి సంతోష్ రెడ్డి, డిసిసి డెలిగేట్ నోముల వెంకట్ రెడ్డి, కుంట గంగారెడ్డి, మాజీ ఎంపిటిసి చింతల కిషన్, సీనియర్ నాయకులు బోర్వేల్ రాజేందర్ రెడ్డి, గంగాధర్, తోపాటు ఆయా గ్రామాలకు చెందిన నాయకులు సర్పంచులు తదితరులు పాల్గొని ప్రత్యేక అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు.టపసులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. అంతకుముందు పుల మాల శాలువా తో సత్కరించారు.ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇందల్ వాయి పోలిస్ సిబ్బంది తో బందోబస్తు ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమం లో సిఈఓ తేజ గౌడ్, మాజీ సర్పంచ్ రాములు నాయక్, మాజీ ఉప సర్పంచ్ నవీన్ గౌడ్, పరుశురాం, బి గంగాధర్ ,మహిపాల్, డైరెక్టర్లు, సిబ్బంది, రైతులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love