రేపు ఎస్టీ కార్పోరేషన్‌ ఇంటర్వూలు..

నవతెలంగాణ-కోహెడ
కోహెడ మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్‌ కార్యాలయంలో రేపు ఎస్టీ కార్పోరేషన్‌ ఇంటర్వూలను నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో మధుసూదన్‌ తెలిపారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఇదివరకు ఎస్టీ కార్పోరేషన్‌ కొరకు ధరఖాస్తు చేసిన వారికి రేపు ఉదయం 11 గంటలకు ఇంటర్వూలను నిర్వహిస్తున్నందున ధరఖాస్తుదారులు సంబంధిత పత్రాలతో హాజరు కావాలని సూచించారు. ఇట్టి ఇంటర్వూలను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Spread the love