భారీ న‌ష్ట‌ల‌తో ముగిసిన స్టా‌క్ మార్కె‌ట్లు‌

Stock-Marketన‌వ‌తెలంగాణ – హైద‌రాబాద్‌
లోక్ సభ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ కు, వాస్తవ ఫలితాలకు భారీ తేడా కనిపించిన నేపథ్యంలో, భారత స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులతో దాదాపు కుప్పకూలాయి. సెన్సెక్స్ ఒక్కరోజే 4 వేల పాయింట్లు నష్టపోగా, నిఫ్టీ నాలుగేళ్లలో ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయిలో నష్టాలు చవిచూసింది. ఈ ఉదయం 8 గంటలకు దేశవ్యాప్తంగా ఓట్ల లెక్కింపు ప్రారంభం కాగా, బీఎస్ఈ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ నిఫ్టీ ట్రేడింగ్ ల్లో వేచిచూసే ధోరణి కనిపించింది. కానీ ఫలితాలు వెల్లడయ్యే కొద్దీ మార్కెట్లు తీవ్ర ఒత్తిళ్లకు లోనయ్యాయి. ముగింపు సమయానికి సెన్సెక్స్ 4,390 పాయింట్ల నష్టంతో 72,079.05 వద్ద క్లోజయింది. నిఫ్టీ 1,379 పాయింట్ల నష్టంతో 21,884.50 వద్ద ముగిసింది. ఇవాళ ఎన్డీయే కూటమి 400 మార్కుకు దరిదాపుల్లో ఉన్నా స్టాక్ మార్కెట్ల పరిస్థితి మరోలా ఉండేది. కానీ, ఫలితాలు భిన్నంగా ఉండడంతో మార్కెట్ సూచీలు అతలాకుతలం అయ్యాయి.

Spread the love