నవతెలంగాణ – ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం లాభాలతో ముగిశాయి. ఉదయం సానుకూలంగా ట్రేడింగ్ ప్రారంభించిన సూచీలకు మధ్య మధ్యలో అమ్మకాల ఒత్తిడి ఎదురైంది. ఉదయం సెన్సెక్స్ 62,601.97 దగ్గర లాభాలతో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 62,719.84- 62,379.86 మధ్య కదలాడింది. చివరకు 118.57 పాయింట్ల లాభంతో 62,547.11 దగ్గర స్థిరపడింది. నిఫ్టీ 18,550.85 దగ్గర ప్రారంభమై ఇంట్రాడేలో 18,573.70- 18,478.40 మధ్య ట్రేడైంది. చివరకు 46.35 పాయింట్లు లాభపడి 18,534.10 దగ్గర ముగిసింది. సెన్సెక్స్30 సూచీలో టాటా స్టీల్, మారుతీ, ఎంఅండ్‌ఎం, సన్‌ఫార్మా, ఎల్‌అండ్‌టీ, భారతీ ఎయిర్‌టెల్, టైటన్, పవర్‌గ్రిడ్, ఎస్‌బీఐ, నెస్లే ఇండియా షేర్లు లాభపడ్డాయి. ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సీఎల్ టెక్, టీసీఎస్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, టెక్ మహీంద్రా, రిలయన్స్, బజాజ్ ఫైనాన్స్, హెచ్‌డీఎఫ్‌సీ షేర్లు అత్యధికంగా నష్టపోయిన షేర్ల జాబితాలో ఉన్నాయి.