– సీఐటీయూ సంఘీభావం మానవహారం
నవతెలంగాణ పాల్వంచ
పాలస్తీనాపై ఇజ్రాయెల్ దాడులను ఆపాలని సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపుల్లో భాగంగా పాలస్తీనాకు సంఘీభావంగా మానవహారం చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు దొడ్డా రవికుమార్ అధ్యక్షతన జరిగిన సభలో ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం జ్యోతి, వృత్తిదారుల జిల్లా కార్యదర్శి సిహెచ్ ముసలయ్యలు మాట్లాడుతూ పాలస్తీనా ఆక్రమితులైన ఇజ్రాయెల్ లు పాలస్తీనా ప్రజలపై అమానుషంగా దాడి చేస్తున్నారు, జనావాసాలు, హాస్పిటళ్లు, స్కూళ్ళు మీద బాంబుల వర్షం కురిపిస్తూ వేలాది ప్రాణాలు బలిగొంటున్నారని అన్నారు. దాడులు ఆపాలన్నారు. ఈ కార్యక్రమంలో నిరంజన్, నాయకులు పొదిలి తులసిరామ్, ఈరల్లా గట్టయ్య, రహమాన్, సోమలింగం ఆవాజ్ జిల్లా అధ్యక్షులు రహీం పాల్గొన్నారు.
ఇల్లందు : అక్టోబరు 7 నుండి పాలస్తీనాపై ఇజ్రాయిల్ దాడులు చేస్తూ మారణ కాండలో సృష్టిస్తున్నది. ఈ యుద్ధంలో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది నిరాశ్రయులయ్యారని సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి అబ్దుల్ నబి అన్నారు. రాష్ట్ర వ్యాప్తింగా సీఐటీయూ ఆధ్వర్యంలో శనివారం నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా ఇల్లందులో నిరసన కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈసం వెంకటమ్మ, ఫాతిమా, అరుణ, పద్మ, వనజ, అలివేలు మంగ, శకుంతల, శోభ, కుమారి, మౌనిక, శ్రీలత, లక్ష్మీనర్సు, సుశీల తదితరులు పాల్గొన్నారు.