చాక్లెట్లు తిని మత్తులో విద్యార్థుల వింత ప్రవర్తన

నవతెలంగాణ కొత్తూరు: తరగతి గదిలో విద్యార్థులు వింతగా ప్రవర్తిస్తోన్న ఘటన రంగారెడ్డి జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో చోటుచేసుకుంది. సమీపంలోని పాన్‌ డబ్బాల యజమానులు గత కొద్దిరోజులుగా విద్యార్థులకు విక్రయిస్తున్న చాక్లెట్లు తిని ఇలా ప్రవర్తిస్తున్నారు. ఆ చాక్లెట్లు తినడంతో తరగతి గదిలో మత్తులోకి జారడంతో పాటు వింతగా ప్రవర్తించారు. గమనించిన ఉపాధ్యాయులు ఆరా తీయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. చాక్లెట్లు తినడంతోనే విద్యార్థులు అలా ప్రవర్తించారని గుర్తించారు. పాన్‌ డబ్బాల యజమానులపై పోలీసులకు ఉపాధ్యాయులు ఫిర్యాదు చేశారు.

Spread the love