ఉద్యోగులను పిలిచి.. వసతులు మరిచి

– ఇబ్రహీంపట్నం ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రంలో వసతుల లేమీ
– రెండు వేల మంది ఎన్నికల సిబ్బందికి మూడు బాత్రూములు
– అందులో రెండు పురుషులకు.. ఒకటి మహిళలకు
– కాలకృత్యాలు తీర్చుకునేందుకు మహిళా ఉద్యోగుల ఇక్కట్లు
– ప్రమాదకరంగా విద్యతు కనెక్షన్
నవతెలంగాణ – రంగారెడ్డి ప్రతినిధి: ఇబ్రహీంపట్నం ఎన్నికల పోలింగ్ సామాగ్రి పంపిణీ కేంద్రం వద్ద కనీస వసతులు మరిచారు. సుమారు 2000 మంది ఉద్యోగులకు 3 మరుగుదొడ్లు మాత్రమే ఏర్పాటు చేశారు. వాటిలో రెండు మరుగుదొడ్లు పురుషులకు కేటాయించగా, ఒక్కటి మాత్రమే మహిళలకు కేటాయించారు. మహిళలు ఉద్యోగులు తమ కాలకృత్యాలు తీర్చుకునేందుకు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఎన్నికల అధికారుల నిర్లక్ష్యానికి ఈ ఘటనలు అద్దం పడుతున్నాయి. ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి సంబంధించిన పోలింగ్ సామాగ్రి పంపిణీ కేంద్రాన్ని ఇబ్రహీంపట్నం నియోజకవర్గం, మంగళపల్లి సమీపంలో ఉన్న సీవీఆర్ ఇంజనీరింగ్ కళాశాల క్రికెట్ మైదానంలో ఏర్పాటు చేశారు.
వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సుమారు 2000 మందికి పైగా ఉద్యోగులు ఈ ఎన్నికల విధుల్లో పాల్గొననున్నారు. వీరిలో సుమారు 200లకు పైగా పోలీసు సిబ్బంది ఉన్నారు. వీరిలోను మహిళా కానిస్టేబుల్స్ ఉన్నారు. ఇదిలా ఉంటే ఎన్నికల పోలింగ్ నిర్వహణకు సంబంధించిన ఉద్యోగులు 2వేల మందిలో సుమారు 500నుండి 600 మందికి పైగా మహిళా ఉద్యోగులు విధుల్లో ఉన్నారు. కాగా పోలింగ్ సామాగ్రి పంపిణీ కేంద్రానికి వచ్చిన ఉద్యోగులకు ఇక్కడి నుంచి బయలుదేరే వరకు కనీస వసతులు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల నిర్వహకులపై ఉంది. సరైన భోజనం, కాలకృత్యాలు తీర్చుకునేందుకు మరుగుదొడ్ల ఏర్పాటు, విశ్రాంతి తీసుకునేందుకు టెంట్లతో పాటు సామియలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. అయితే కనీస వసతులైన మరుగుదొడ్ల ఏర్పాటు విషయంలో ఎన్నికల సిబ్బంది నిర్లక్ష్యాన్ని ప్రదర్శించారని చెప్పొచ్చు. 2000 మంది వరకు ఉన్న ఉపాధ్యాయులకు కేవలం మూడు మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు. వాటిలో రెండు మరుగుదొడ్లు పురుషులకు కేటాయించగా ఒక్క మరుగుదొడ్డి మాత్రమే మహిళా ఉద్యోగులకు కేటాయించారు. వాటిని ఉపయోగించుకునేందుకు స్త్రీ పురుష ఉద్యోగులు ఇద్దరు ఇబ్బందులకు ఎదుర్కొన్నారు. ప్రధానంగా మహిళా ఉద్యోగులకు కేటాయించిన కేవలం ఒకే ఒక మరుగుదొడ్డిని ఉపయోగించుకోలేక పరిసరాలకు వెళ్లి కాలకృత్యాలు ఉపయోగించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మహిళా ఉద్యోగులు గుంపులు గుంపులుగా వెళ్లి కాలకృత్యాలు తీర్చుకోవడం ఆందోళన కలిగించింది. కనీసం మహిళా ఉద్యోగులు అత్యవసర పరిస్థితి కూడా ఏర్పాటు చేయాలని దుస్థితిలో ఎన్నికల సిబ్బంది ఉండడం పట్ల మహిళా ఉద్యోగులు ఆందోళన గురయ్యారు. పురుషుల కోసం కేటాయించిన మరుగుదొడ్లు సైతం ఉపయోగించుకోలేకపోయారు.

ప్రమాదకరంగా విద్యుత్తు కనెక్షన్
పంపిణీ కేంద్రానికి అమర్చిన విద్యుత్తు కనెక్షన్ ప్రమాదకరంగా ఏర్పడింది. అతుకుల కలెక్షన్లతో షాకు తలిగే ప్రమాదం ఉండడంతో పోలీసులు భయాందోళనల మధ్య విధులు నిర్వహించారు. అతుకుల కనెక్షన్ కు టేపును బిగించకుండా ప్లాస్టిక్ కవర్ చుట్టారు. ప్లాస్టిక్ కవర్ కలి పొగలు వస్తున్నడంతో పోలీసులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే నిర్వాహకులకు సమాచారం ఇచ్చినా లైట్ గా తీసుకున్నారు. పోలీసులు అక్కడి నుంచి పక్కకు జరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. భోజనం వసతులు అంతంతే.. ఎంతో దూరం నుంచి ఉదయం 10 గంటలకే ఎన్నికల సిబ్బంది పరికరాల పంపిణీ కేంద్రానికి చేరుకున్నారు. మధ్యాహ్నం మూడు గంటల వరకు సమయం పట్టే అవకాశం ఉన్నందున మధ్యాహ్న భోజనాన్ని ఏర్పాటు చేశారు. అయితే కేవలం వారికి పప్పు కర్రీ, ఎగ్ కర్రీ, మజ్జిగ, సాంబార్ ఏర్పాటు చేసిన సంగం మంది భోజనం చేసే వరకే అయిపోయింది. చేసిలేక పప్పుతో సరిపుచుకున్నారు. కనీస వసతులతో పాటు భోజనాన్ని కూడా సరిగా ఏర్పాటు చేయక పోవడం పట్ల ఉద్యోగుల అసహనం వ్యక్తం చేశారు.

Spread the love