కామాంధుడిపై కఠిన చర్యలు తీసుకోవాలి

– బాలిక కుటుంబానికి న్యాయం చేయాలి
– సీపీఐ(ఎం) మండల కన్వీనర్‌ నిమ్మల వెంకన్న
నవతెలంగాణ-పినపాక
మండలంలోని జానంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగి మణుగూరులో 9 ఏండ్ల బాలికపై అత్యాచారం చేసిన సంఘటనను సీపీఐ(ఎం) మండల కార్యదర్శి నిమ్మల వెంకన్న తీవ్రస్థాయిలో ఖండించారు. ఆదివారం మండల కేంద్రంలో ఆయన మాట్లాడారు. నిందితుని రిమాండ్‌లోకి తీసుకోవడం, ఫోక్సో కేస్‌ నమోదు చేయడం వల్ల ఎటువంటి లాభం లేదని ఇటువంటి దుర్మార్గులను బహిరంగంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. ఎన్ని చట్టాలు చేసినా కామాంధులులో మార్పు రావడం లేదన్నారు. బాలికను వైద్య పరీక్షలకు పంపించి వైద్య ఖర్చులను ప్రభుత్వం భరించాలి అన్నారు. బాలికకు నష్టపరిహారం అందించటం కాకుండా బాలిక చదువుకు సైతం ప్రభుత్వం సహాయం అందించాలని కోరారు. చదువు పూర్తయిన తర్వాత బాలికకు ప్రభుత్వమే ఉద్యోగం కల్పించాలన్నారు. బాలిక కుటుంబానికి అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోమని ప్రజా సంఘాలను కలుపుకొని పెద్ద సంఖ్యలో ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Spread the love