నవతెలంగాణ – భిక్కనూర్
బక్రీద్ పండుగ సందర్భంగా ఆవులు, దూడలను అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్సై ఆంజనేయులు హెచ్చరించారు. గురువారం టోల్ ప్లాజా సమీపంలో ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ దగ్గర తనిఖీ చేస్తున్న సమయంలో బొలెరో వాహనంలో అక్రమ ఎలాంటి అనుమతులు లేకుండా రవాణా చేస్తున్న 11 ఆవు దూడలను అలాగే పరిమితికి మించి ఎక్కువ లేక దూడలను తరలిస్తున్న వాహనం, డ్రైవర్ పై కేసు నమోదు చేయడం జరుగిందన్నారు. పట్టుకున్న ఆవు,దూడలను గోశాలకు తరలించడం జరిగిందన్నారు. నిత్యం చెక్ పోస్ట్ వద్ద పశువైద్యాధికారులు పర్యవేక్షణలో పోలీసులు అక్రమ రవాణాపై నిఘ పెడుతూ పశువుల ఆక్రమణలు అరికట్టడం జరుగుతుందన్నారు. అదేవిధంగా ఎవరైనా పశువులను అక్రమ రవాణా చేస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు.
ఆవు దూడలను అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు
- Advertisement -
- Advertisement -



