శనివారం అర్ధరాత్రి పరారైన విద్యార్థులు
నవతెలంగాణ- సంస్థాన్ నారాయణపురం
సర్వేల్ గురుకుల పాఠశాల నుంచి అర్ధరాత్రి పారిపోయిన ఇద్దరు విద్యార్థులు తిరుపతిలో ప్రత్యక్షమయ్యారు. నల్లగొండ జిల్లా సంస్థాన్‌నారాయణపురం మండలంలోని సర్వేల్ గురుకుల పాఠశాల నుంచి శనివారం అర్ధరాత్రి ఒకటిన్నర గంటల సమయంలో గోడ దూకి మరో ఇద్దరు 8వ తరగతి విద్యార్థులు పరారయ్యారు. తిరుపతి చూసేందుకు వెళ్లామంటూ విద్యార్థులు చెప్పడం గమనార్హం.
సంస్థాన్‌నారాయణపురం మండలం కొతులాపురం గ్రామానికి చెందిన ఇరుగంటి నవదీప్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా దుగ్యాల గ్రామానికి చెందిన గుండెబోయిన అభినయ్ సర్వేల్ గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నారు. ఇద్దరూ శనివారం అర్ధరాత్రి అందరూ నిద్రిస్తున్న సమయంలో పాఠశాల ప్రహరీ గోడ దూకి పరారయ్యారు. ఆదివారం ఉదయం పాఠశాల ప్రిన్సిపాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాము తిరుపతికి వెళ్తామంటూ ఆ ఇద్దరు విద్యార్థులు వారం రోజుల నుంచి తోటి విద్యార్థులకు హింట్ ఇచ్చారు. దాంతో వారు చెప్పిన సమాచారం మేరకు పోలీసులు గాలించారు. సీసీ ఫుటేజీలను పరిశీలించారు. పాఠశాల నుంచి నడుచుకుంటూ వెళ్లిన యువకులు అల్లందేవి చెరువు గ్రామంలో రోడ్డు పక్కన ఉన్న సైకిల్ తీసుకొని గుడిమల్కాపురం చేరుకున్నారు. అక్కడి నుంచి నడుచుకుంటూ చౌటుప్పల్ చేరుకున్నట్టు గమనించారు. ఆ ఇద్దరి ఫొటోలతో కూడిన చిరునామా తిరుపతి రైల్వే పోలీసులకు పంపించారు. సోమవారం ఉదయం తిరుపతి రైల్వే స్టేషన్ లో రైలు దిగుతున్న వారిని పోలీసులు అదుపులోకి ఫొటోలు తీసి స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. వంటెనే పాఠశాల ప్రిన్సిపాల్, తల్లిదండ్రులకు తెలియజేశారు. సోమవారం పాఠశాలకు చేరుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు, బంధువులతో తెలంగాణ రాష్ట్ర గురుకుల విద్యాలయ సొసైటీ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాస్, చౌటుప్పల్ రూరల్ సీఐ సతీష్ రెడ్డి, స్థానిక ఎస్‌ఐ పాండు మాట్లాడారు. విద్యార్థుల పరారీకి గల కారణాలను పరిశీలిస్తున్నారు.
తిరుపతిలో సర్వేల్ గురుకుల విద్యార్థులు ప్రత్యక్షం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



