నవతెలంగాణ-జూలూరుపాడు
విద్యార్థులు రాష్ట్రస్థాయిలో రాణించాలని జూలూరుపాడు జెడ్పీ హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు లక్ష్మి నరసయ్య అన్నారు. జూలూరుపాడు జెడ్పీ హైస్కూల్‌లో జోనల్ ఆట పోటీలను ప్రధానోపాధ్యాయులు లక్ష్మి నరసయ్య ప్రారంభించి విద్యార్థులతో కలిసి సరదాగా ఆటలు ఆడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ విద్యార్థులకు ఆటల వల్ల ఎంతో మానసిక ఉల్లాసం కలుగుతుందన్నారు. శారీరకంగా ధఢంగా ఉంటారని అన్నారు. క్రీడల్లో యువత రాణించాలని కోరారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.