విజయవంతంగా జిల్లా స్థాయి స్పోర్ట్స్ స్కూల్ ఎంపికలు

నవతెలంగాణ – సిద్దిపేట 
విజయవంతంగా జిల్లా స్థాయి స్పోర్ట్స్ స్కూల్ ఎంపికలు నిర్వహించినట్లు డివైఎస్ఓ నాగేందర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన స్పోర్ట్స్ ఆథారిటీ ఆఫ్ తెలంగాణ, జిల్లా కలక్టర్  ఆదేశాలకనుగుణంగా జిల్లా స్పోర్ట్స్ అధారిటి సిన్పిపెట్ అధ్వర్యములో,  సిద్దిపేట్ జిల్లా స్కూల్ గేమ్స్ సహకారముతో జిల్లా స్థాయి స్పోర్ట్స్ స్కూల్ ఎంపికలు 4,5వ తరగతి బాల, బాలికలకు నిర్వహించినట్లు తెలిపారు.  4 వ తరగతి ఎంపికలకు బాలురు 23, బాలికలు 19, 5 వ తరగతి ఎంపికలకు బాలురు 65, బాలికలు 34 మొత్తము 141 మంది హాజరైనట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్కూల్ గేమ్స్ జిల్లా కార్యదర్శి రామేశ్వర్ రెడ్డి, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love