
దివంగత మాజీ ఎమ్మెల్యే డాక్టర్ నెమరుగొమ్ముల సుధాకర్ రావు సేవలు ఆదర్శనీయమని కాంగ్రెస్ పాలకుర్తి నియోజకవర్గం ఇంచార్జి హనుమండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి అన్నారు. శనివారం వడ్డెకొత్తపల్లి లోని ఆయన నివాసంలో సుధాకర్ రావు కు చిత్రపటానికి పూలమాలలు వేసి ఆమె నివాళులర్పించారు. భార్య విజయలక్ష్మి, కుమారుడు వెంకట అనంత రావు (సంజయ్) కూతురు కార్తీక, ప్రవీణ్ రావు లను ఝాన్సీ రెడ్డి పరామర్శించి, ఓదార్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజల మనిషిగా సుధాకర్ రావు ఎల్లప్పుడూ ప్రజల హృదయాల్లో నిలిచే ఉంటారన్నారు. నేడు ఆయన మన మధ్య లేకపోవడం అత్యంత బాధాకరమని విచారం వ్యక్తం చేశారు. అటు వైద్యరంగంలో ఆయన సేవలు ఎందరికో ప్రాణాలు పోశారని అన్నారు. నిస్వార్ధ ప్రజా నాయకుడిగా ఆయన అందించిన సేవలు మరువలేనివని కొనియాడారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ముద్దసాని సురేష్, ఉపాధ్యక్షుడు రంగు మురళి గౌడ్, ప్రధాన కార్యదర్శి ఓరిగంటి సతీష్, బీసీ సెల్ మండల అధ్యక్షుడు దాసరి శ్రీనివాస్, మైనార్టీ సెల్ మండల అధ్యక్షుడు జాను, ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు సీతారామ్ నాయక్ , పాలకుర్తి దేవస్థానం డైరెక్టర్ పన్నీరు వేణు, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బీసు హరికృష్ణ, మండల సోషల్ మీడియా కో-ఆర్డినేటర్ ఎరుకల సమ్మయ్య గౌడ్, వడ్డెకొత్తపల్లి గ్రామ అధ్యక్షుడు దంతాలపెల్లి ఉపేందర్, బానోత్ వెంకన్న, శేఖర్, ఉప్పలయ్య, రాంబాబు, యాకన్న, అనిల్, శివరాత్రి సుగుణ, తదితరులు పాల్గొన్నారు.