19 నాటికి సునీతా రిటర్న్‌!

Sunita's return by the 19th!న్యూయార్క్‌: గత తొమ్మిది నెలలుగా అంతరిక్షంలోనే చిక్కుకుపోయిన వ్యోమగాములు సునీతా విలిమమ్స్‌, బుచ్‌ విల్‌మోర్‌ భూమిపైకి తిరిగి రావడంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కేవలం 8 రోజుల మిషన్‌? కోసం జూన్‌ 6న కు వెళ్లిన వీరిద్దరూ వ్యోమనౌకలో హీలియం లీకేజీ కారణంగా ఇప్పటివరకూ అక్కడే గడపాల్సి వచ్చింది.అటు నాసా అధికారులు, స్పేస్‌?ఎక్స్‌ ఇంజనీర్లు వీరిని తీసుకురావడంపై ప్రతీసారి ఒక కొత్త తేదీని ప్రకటిస్తున్నారు. ఈసారి వీరు కచ్చితంగా భూమికి తిరిగి వస్తారని చెప్పినప్పుడల్లా మళ్లీ ఏదో ఒక సాంకేతిక సమస్య తలెత్తడంతో వారి రాక మరింత ఆలస్యం అవుతోంది. ఈ క్రమంలో వీరిని భూమికి తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా క్రూ-10 మిషన్‌ను బుధవారం అంటే మార్చి 13న ప్రయోగించేందుకు అంతా సిద్ధమైంది. అయితే ఈ మిషన్‌లోనూ సాంకేతిక సమస్య తలెత్తడంతో ప్రయోగం మళ్లీ నిలిచిపోయింది.ఆస్ట్రానాట్స్‌ మార్చి 19 నాటికి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి బయలుదేరనున్నట్టు ప్రకటించింది. ఇప్పటికైనా ఆ ఇద్దరు వ్యోమగాముల్ని భూమిపైకి తీసుకురావటంతో సఫలమవ్వాలని అందరూ కోరుకుంటున్నారు.

Spread the love