130 ఏళ్ల తర్వాత కోర్టుకు వెళ్తున్న బ్రిటిష్ రాయల్!

నవతెలంగాణ – లండన్: ప్రపంచవ్యాప్తంగా ఇంకా కొన్ని దేశాల్లో రాజవంశీయులు ఉన్నారు. సాధారణంగా రాజవంశీయులు బయటకు రారు. ఏదైనా పెద్ద వేడుక జరిగే సమయంలో.. అది అందులో రాజవంశీయులు తప్పకుండా పాల్గొనాల్సి ఉందంటేనే బయటకు వస్తారు. కానీ 130 సంవత్సరాల తర్వాత తొలిసారిగా బ్రిటన్‌ రాజవంశానికి చెందిన వ్యక్తి కోర్టుకు హాజరుకానున్నారు. అది సాక్ష్యం చెప్పడం కోసం. తప్పుడు కథనం ప్రచురించి, పరువుకు భంగం కలిగించారని పేర్కొంటూ బ్రిటన్ పత్రికపై పరువు నష్టం దావా వేసిన ప్రిన్స్ హ్యారీ .. కోర్టుకు హాజరుకానున్నారు. 130 ఏళ్ల తర్వాత కోర్టుకు సాక్షిగా హాజరవుతోన్న బ్రిటన్ రాజవంశానికి చెందిన మొదటి వ్యక్తిగా ప్రిన్స్ హ్యారీ నిలవనున్నారు. ఇందుకు సంబంధించిన పరువునష్టం దావా కేసు వచ్చే వారం లండన్ హైకోర్టులో విచారణకు రానుంది. కింగ్ చార్లెస్ చిన్న కుమారుడు హ్యారీతో పాటు 100 మందికిపైగా ప్రముఖులు డైలీ మిర్రర్ ప్రచురణకర్త మిర్రర్ గ్రూప్ న్యూస్‌పేపర్స్ సండే మిర్రర్, సండే పీపుల్స్‌కు వ్యతిరేకంగా పరువు నష్టం కేసులు దాఖలు చేశారు. లండన్ హైకోర్టులో జరిగే విచారణకు ప్రిన్స్ హ్యారీ సాక్షిగా హాజరవుతున్నారు.

Spread the love