కాంగ్రెస్ పార్టీని ఆదరించండి: డిసిసి అధ్యక్షుడు

నవతెలంగాణ- దామరచర్ల    

మండలంలోని  వాడపల్లి గ్రామంలో మండల  పార్టీ ఆధ్వర్యంలో గడపగడపకు  కాంగ్రెస్ మేనిఫెస్టో 6 గ్యారంటీ స్కీముల కరపత్రాలను బుధవారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కేతావత్ శంకర్ నాయక్ హాజరై మాట్లాడుతూ నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షలను గౌరవించి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీని ప్రజలందరూ ఆదరించాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీల స్కీములను ప్రభుత్వం ఏర్పాటు చేయగానే అమలు చేసి అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు శ్రీనివాస్ , ఓబిసి సెల్ మండల అధ్యక్షులు బత్తుల శ్రీను, ఆదివాసి కాంగ్రెస్ పార్టీ నల్గొండ జిల్లాఇంఛార్జి హడావత్ నాగు నాయక్ , బీసీ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జీడయ్య యాదవ్, మండల కాంగ్రెస్ నాయకులు కొమ్ము దాసు, వాడపల్లి మాజీ సర్పంచ్ బనావాత్ అరుణ , మండల కాంగ్రెస్ నాయకులు సుద్దబోయిన సైదులు గౌడ్, మండల కాంగ్రెస్ నాయకులు అల్లం నాగరాజు యాదవ్, వీరప్పగూడెం గ్రామ అధ్యక్షులు బత్తిని వెంకటేశ్వర్లు గౌడ్, మండల మైనార్టీ కాంగ్రెస్ అధ్యక్షులు ఎస్ డి ఖాదర్, నరసింహారెడ్డి, పొదిలా శ్రీను, శుద్ధ బోయిన నరసయ్య, యాతం సైదులు, అద్య నాయక్, కృష్ణ నాయక్, ఆనంద్ నాయక్, బత్తుల కోటేశ్వరరావు, భక్తుల శ్రీను, భక్తుల చంటి, తురక శివ, రాంబాబు, సిద్దయ్య, వెంకటయ్య, గోపి, రాజుమరియు మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.
Spread the love