Wednesday, August 19, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలువృద్ధులు, బీడీ కార్మికులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల‌కూ చేయూతనివ్వాలి

వృద్ధులు, బీడీ కార్మికులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల‌కూ చేయూతనివ్వాలి

- Advertisement -

వెంటనే వారి నుంచి దరఖాస్తులుస్వీకరించాలి : సీపీఐ(ఎం)
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
వృద్ధులు, బీడీ కార్మికులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల నుంచీ దరఖాస్తులను స్వీకరించి వారికి చేయూత పథకం కింద పింఛన్లు ఇవ్వాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ డిమాండ్‌ ‌చేసింది. మంగళవారం ఈ మేరకు సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌‌వెస్లీ ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం చేపట్టిన ‘చేయూత’ (సామాజిక భద్రతా) కొత్త పింఛన్ల దరఖాస్తుల ప్రక్రియలో అత్యంత కీలకమైన పేద వర్గాలను విస్మరించడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. వృద్ధులు, లక్షలాది మంది బీడీ కార్మికులతో పాటు, హెచ్‌ఐవీ, ఎయిడ్స్ బాధితులు, ఫైలేరియా (బోదకాలు) బాధితులు, తలసేమియా, సికిల్‌సెల్ డిసీజ్, హీమోఫీలియా రోగుల నుంచి ప్రస్తుతం సేకరిస్తున్న కొత్త పింఛన్ల దరఖాస్తులను స్వీకరిం చకపోవడం విచారకరమని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి వారి దరఖాస్తులను కూడా స్వీకరించి, పింఛన్లు అందజేయాలని డిమాండ్‌ ‌చేశారు. ప్రతి అర్హునికీ సామాజిక భద్రత కల్పిస్తామని చెప్పిన ప్రభుత్వం, నేడు క్షేత్రస్థాయిలో వారి నుంచి దరఖాస్తులను స్వీకరించకపోవడం సరిగాదని తెలిపారు. దరఖాస్తులకు విధించిన ఆగస్టు 31 తుది గడువును పెంచాలనీ, దీనిని నిరంతర ప్రక్రియగా కొనసాగించాలని కోరారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలో భాగంగా తక్షణమే పింఛన్ల మొత్తాన్ని పెంపుదల చేసి, అర్హులందరికీ కొత్త పింఛన్లు అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ ‌చేశారు. ​

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -