బీఆర్ఎస్ పార్లమెంటరీ నేతగా సురేశ్‌రెడ్డి..

నవతెలంగాణ – హైదరాబాద్ : బీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ నేతగా, రాజ్యసభలో పక్షనేతగా కేఆర్ సురేశ్ రెడ్డిని నియమిస్తున్నట్లు పార్టీ అధినేత కేసీఆర్ వెల్లడించారు. కె.కేశవరావు స్థానంలో సురేశ్‌కు అవకాశం ఇచ్చినట్లు రాజ్యసభ, లోక్‌సభ సెక్రటరీ జనరల్‌లకు లేఖ రాశారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓడిపోగానే ఎంపీ కేశవరావు కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే.

Spread the love